అమ్మ డిజైనర్‌... అమ్మాయిలు మోడల్స్‌

పిల్లల అభిరుచిని గుర్తించి వారికి నచ్చిన రంగాల్లో అడుగుపెట్టేలా చేయూతనిస్తుంటారు తల్లిదండ్రులు.  ఈ అమ్మాయిలు మాత్రం తమ తల్లి డిజైన్‌ చేసిన దుస్తులకు  మోడల్స్‌గా మారారు.  అమ్మ అభిరుచికి పిల్లల సహకారం తోడవ్వడంతో వారు

Updated : 18 Mar 2022 02:58 IST

పిల్లల అభిరుచిని గుర్తించి వారికి నచ్చిన రంగాల్లో అడుగుపెట్టేలా చేయూతనిస్తుంటారు తల్లిదండ్రులు.  ఈ అమ్మాయిలు మాత్రం తమ తల్లి డిజైన్‌ చేసిన దుస్తులకు  మోడల్స్‌గా మారారు.  అమ్మ అభిరుచికి పిల్లల సహకారం తోడవ్వడంతో వారు ప్రారంభించిన ‘ది ఇండియన్‌ ఎథ్నిక్‌’ ప్రస్తుతం కోట్లలో వ్యాపారం చేస్తోంది. ఆ తల్లీకూతుళ్ల విజయగాధ ఇది..

హీతల్‌ తన ఇద్దరు కూతుళ్లు లఖ్నీ, త్వారాలకు చిన్నప్పటి నుంచి తానే స్వయంగా దుస్తులను డిజైన్‌ చేసేది. ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగినా అక్కడామె ఉండాల్సిందే. నాణ్యమైన, మంచి వర్ణాల్లో పలురకాల వస్త్రాలను ఎంపిక చేసి వాటితో రకరకాల దుస్తులను రూపొందించేది. పండుగలు, శుభకార్యాల్లో వీళ్ల దుస్తులే బంధువులు, స్నేహితులకు హాట్‌ టాపిక్‌. హీతల్‌ సృజనాత్మకతను అందరూ ప్రశంసించే వారు.

ఎటువంటి కోర్సు చేయలేదు...

అమ్మ సృజనాత్మకతను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటుంది త్వారా. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రెడీమేడ్‌ దుస్తులను కొనలేదు. చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లితే అక్కడందరూ మా దుస్తులనే ప్రత్యేకంగా చూసేవారు. కొందరైతే అమ్మను ప్రశంసలతో ముంచెత్తేవారు. కాలేజీలో మా స్నేహితులు కూడా ఆ తరహా డిజైన్‌ చేసి ఇమ్మని అడిగే వారు. అలాగని తను ఫ్యాషన్‌డిజైనింగ్‌ కోర్సు ఏదీ చదవలేదు. ఓ రోజు  మాటల్లో అమ్మ ప్రతిభ నలుగురికీ తెలిసేలా ఎందుకు చేయకూడదని లఖ్నీతో అన్నా. తనూ సరేనంది. అలా 2016లో ప్రారంభమైంది ‘ద ఇండియన్‌ ఎథ్నిక్‌’ అని చెబుతుంది త్వారా.

గ్యాప్‌ వచ్చింది...

‘పుణె, ముంబయిలోని ఎగ్జిబిషన్లన్నీ చుట్టేసి, రకరకాల వస్త్రాలను ఎంపిక చేసుకున్నాం. సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసి నేను డిజైన్‌ చేసిన దుస్తులకు మోడల్స్‌గా ఫొటోలు తీసి వాటిని పోస్ట్‌ చేసేవారు. ఆసక్తి ఉన్నవారు ఆ డిజైన్‌కు ఆర్డరివ్వొచ్చని చెప్పాం. మొదటిరోజే గోవా నుంచి మొదటి ఆర్డరు వచ్చింది. దాంతో ఉత్సాహం రెట్టింపైంది. అలాగే కుర్తాలూ, చీరలపై డిజైన్స్‌ కూడా ప్రారంభించాం. వాటితో క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. ఇప్పుడు మా దగ్గర 25మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ముంబయిలో మూడు ఆఫీసులు తెరిచాం 450 నగరాలు, పట్టణాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అలాగే అమెరికా, ఇంగ్లండ్‌, జపాన్‌, చైనా, ఆస్ట్రేలియా, మలేషియా, న్యూజిలాండ్‌.. వంటి దేశాలకు చెందిన వినియోగదార్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పటివరకు మూడు వేలమందికిపైగా దుస్తులు డిజైన్‌ చేసి అందిచ్చా. మరొక విషయమేంటంటే ఇప్పటికీ మా అమ్మాయిలే మోడల్స్‌గా ఉన్నారు. రెండేళ్లకిత్రం వరకు బాగానే సాగింది. రూ.25 లక్షల వార్షికాదాయం వచ్చేది. కొవిడ్‌ నేపథ్యంతో కొంత తగ్గింది. వెబ్‌సైట్‌ ప్రారంభించిన తర్వాత గతేడాది చివర్లో తిరిగి పెరిగి రూ.కోటి దాటింది’ అని చెబుతున్న హీతల్‌ ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో యాడ్స్‌, ఫొటోలను అప్‌లోడ్‌ చేయడం వంటివన్నీ నేర్చుకుంది. మరిన్ని కొత్త డిజైన్లతో ఈ ఏడాది మరిన్ని లాభాలను పొందాలనుకుంటున్న ఈ తల్లీ కూతుళ్లను అభినందించకుండా ఉండలేం కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్