ఎరుపు.. కథ!

ఒక అమ్మాయి భావోద్వేగాలని.. మరో అమ్మాయి కంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలుగుతారు? ఇది నిజమే అని నిరూపించింది దర్శకురాలు డామీషీ. నెలసరులు, టీనేజీ వయసులో ఆడపిల్లల భావోద్వేగాలే

Published : 27 Mar 2022 00:59 IST

క అమ్మాయి భావోద్వేగాలని.. మరో అమ్మాయి కంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలుగుతారు? ఇది నిజమే అని నిరూపించింది దర్శకురాలు డామీషీ. నెలసరులు, టీనేజీ వయసులో ఆడపిల్లల భావోద్వేగాలే ముడిసరకుగా ఆమె దర్శకత్వం వహించిన ‘టర్నింగ్‌ రెడ్‌’ యానిమేషన్‌ చిత్రం రికార్డులని బ్రేక్‌ చేసింది. దీన్ని నిర్మించిన పిక్సార్‌ సంస్థ 36 ఏళ్ల చరిత్రలో తొలి దర్శకురాలిగా మారి గౌరవాన్ని అందుకుని గ్లాస్‌సీలింగ్‌ని బద్దలుకొట్టింది. వాల్‌-ఈ, ఫైండింగ్‌ నీమో,  లూకావంటి చిత్రాలతో ప్రసిద్ధి కెక్కిందీ సంస్థ. అది 25 సినిమాలు తీస్తే అన్నీ అబ్బాయిల కథాంశాలే. ‘టర్నింగ్‌ రెడ్‌’ మాత్రం మెమె అనే అమ్మాయి.. వాళ్ల అమ్మ మింగ్‌ చుట్టూ తిరుగుతుంది. మెమెకి నెలసరి మొదలయ్యాక, భావోద్వేగానికి గురైనప్పుడల్లా ఉన్నట్టుండి రెడ్‌ పాండాగా మారుతుంది. ఎందుకలా? అనేదే కథ. ‘మా అమ్మానాన్నలు చైనా నుంచి వచ్చి కెనడాలో స్థిరపడ్డారు. నాన్న ఆర్ట్‌ టీచర్‌. అమ్మ ఉద్యోగి. టీనేజీలో మా అమ్మకూ, నాకూ ఎదురైన ఘర్షణనే ఈ చిత్రంగా మలిచా. ఇందులో ఎరుపు నెలసరులను సూచిస్తుంది’ అంటుంది డామీషీ. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, రచన జూలియాచో, నిర్మాణ బాధ్యురాలు లిండ్సే కొలిన్స్‌. అంతా మహిళలే పనిచేసిన సినిమాగా కూడా టర్నింగ్‌ రెడ్‌ ప్రశంసలు అందుకుంటోంది. అన్నట్టు... డామీషీ గతంలో పిక్సార్‌ కోసం తీసిన ‘బావో’ ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌గా అకాడమీ పురస్కారాన్నీ అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్