కుటుంబ కష్టాలను గట్టెక్కించారు!

పాత గాజులు, వాడి పడేసే టూత్‌బ్రష్‌ ఏదీ వృథా కాదంటున్నారీ అక్కాచెల్లెళ్లు. అనడమే కాదు, వాటిని ఆకర్షణీయ వస్తువులుగా ఎలా మార్చవచ్చో వివరిస్తూ ఆ వీడియోల్ని యూట్యూబ్‌లో పెడుతున్నారు. వీటిని కోట్ల మంది వీక్షిస్తున్నారంటే నమ్మగలరా!

Published : 28 Mar 2022 01:00 IST

పాత గాజులు, వాడి పడేసే టూత్‌బ్రష్‌ ఏదీ వృథా కాదంటున్నారీ అక్కాచెల్లెళ్లు. అనడమే కాదు, వాటిని ఆకర్షణీయ వస్తువులుగా ఎలా మార్చవచ్చో వివరిస్తూ ఆ వీడియోల్ని యూట్యూబ్‌లో పెడుతున్నారు. వీటిని కోట్ల మంది వీక్షిస్తున్నారంటే నమ్మగలరా!

స్నేహ, పూజ అప్పటికింకా ఇంటర్మీడియెట్‌ కూడా పూర్తిచేయలేదు. అంతవరకూ బాగా ఉన్న వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దాంతో తల్లిదండ్రులకు చేయూతనిచ్చేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. యూట్యూబ్‌ గురించి వింటుండటంతో వీడియోలు చేద్దామనుకున్నారు. అక్కాచెల్లెళ్లకు కళాకృతుల తయారీలో మంచి సృజన ఉంది. వృథా వస్తువులతో ఏమేం తయారు   చేయొచ్చో చూపిస్తూ వీడియోలు తీసి యూట్యూబ్‌(ఆర్ట్‌ కళ ఛానెల్‌)లో పెట్టారు. 2016 సెప్టెంబరులో ప్రారంభించినప్పుడు స్పందన అంతంత మాత్రమే. అయినా  నిరుత్సాహపడలేదు. పాత వస్తువులతో ఆకర్షణీయ దీపాలు ఎలా చేయాలో చూపిస్తూ దీపావళి సమయంలో ఓ వీడియో పెట్టారు. దానికి ఊహించని స్థాయిలో వీక్షణలు వచ్చాయి. తర్వాత క్రమంగా సబ్‌స్క్రైబర్లూ పెరిగారు. ప్రస్తుతం ఈ ఛానెల్‌కు 45 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాత ప్లాస్టిక్‌ జార్‌, టూత్‌బ్రష్‌లు, గాజులతో అలంకరణ వస్తువుల తయారీపైన చేసిన వీడియోల్లో ఒక్కోదానికి కోటికిపైనే వీక్షణలు  ఉన్నాయంటే నమ్మగలరా. వీరి వీడియోల్ని చూస్తూ అలాంటి ఉత్పత్తుల్ని తయారుచేసి వ్యాపారులుగా మారినవాళ్లూ ఉన్నారు. ప్రస్తుతం నూనె లేకుండా పచ్చళ్ల తయారీ లాంటి వంటింటి చిట్కాలూ చెబుతున్నారు. వీరికి తమ్ముడు పవన్‌ కూడా సాయపడతాడు. వీరి యూట్యూబ్‌ ఛానెల్‌ ఆదాయంతో కుటుంబ ఆర్థిక కష్టాలు తీరిపోయాయి. ‘ఈ స్థాయి విజయం దక్కుతుందని అస్సలు ఊహించలేదు. మొదటి నెల మా ఆదాయం  రూ.400. అయినా నిరుత్సాహపడలేదు. ప్రస్తుతం మాకు చాలినంత మొత్తం వస్తోంది. పట్నాలో ఆఫీసు తెరిచాం. పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాం.’ అని చెబుతారు స్నేహ, పూజ. వీరు ఎదిగిన తీరుని యూట్యూబ్‌ సైతం కొనియాడింది. ‘ఏదైనా కంటెంట్‌ని సృష్టించాలనుకునేటప్పుడు దేనికి డిమాండ్‌ ఉంటుందో గమనించి అడుగు వేయండి. ఎదుగుతున్న క్రమంలో చాలా  విమర్శలు వస్తాయి. వాటిలోని మంచిని మాత్రమే తీసుకోండి. వినూత్నంగా ఆలోచిస్తూ  ముందుకు వెళ్లాలి’ అంటారీ అక్కాచెల్లెళ్లు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్