డీజిలా... ఇంటికే పంపుతా!
ఆహారం, దుస్తులూ, మందులూ... ఇప్పుడేది కావాలన్నా డోర్డెలివరీనే! కానీ కొన్నింటికి మాత్రం మినహాయింపు ఉంది. వాటిలో డీజిల్ ఒకటి. వ్యాపారులూ, రైతులూ, హౌసింగ్ సొసైటీలకు డీజిల్ పెద్ద మొత్తంలో అవసరమవుతుంది. దానికోసం
ఆహారం, దుస్తులూ, మందులూ... ఇప్పుడేది కావాలన్నా డోర్డెలివరీనే! కానీ కొన్నింటికి మాత్రం మినహాయింపు ఉంది. వాటిలో డీజిల్ ఒకటి. వ్యాపారులూ, రైతులూ, హౌసింగ్ సొసైటీలకు డీజిల్ పెద్ద మొత్తంలో అవసరమవుతుంది. దానికోసం కిలోమీటర్ల దూరంలోని బంకు నుంచి కావాల్సిన చోటకి డీజిల్‌ని సురక్షితంగా తరలించడం కష్టమవుతుంది. ఈ సమస్యని పరిష్కరించడానికి ‘హమ్‌సఫర్’ను మొదలుపెట్టింది సాన్యా గోయల్.
ఇంగ్లండ్ వార్విక్ విశ్వవిద్యాలయంలో ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో మాస్టర్స్ చేసి స్వదేశానికి తిరిగొచ్చిన సాన్యా ముందు ఉద్యోగం, వ్యాపారం అనే రెండు దారులున్నాయి. కుటుంబంలో నాలుగు తరాలుగా వ్యాపారులే కావడంతో వ్యాపారం వైపే మొగ్గుచూపింది. ఒకసారి డీజిల్‌ని డ్రమ్ముల్లో నింపి రిక్షావాలాలు తీసుకొని వెళ్లడం చూసి అదెంత ప్రమాదకరమో అనుకుంది. ఆ విషయమై పరిశోధించగా డీజిల్‌ని కావాల్సిన చోటకి సరఫరా చేయడంలో ఉన్న కష్టాలు అర్థమయ్యాయి. నాణ్యత, రక్షణ లేకపోవడం, కొలతలో తేడా, చోరీకి గురవడం లాంటి అనేక సమస్యలున్నట్లు గుర్తించింది. వీటిని పరిష్కరిస్తూ ఇంధనం సురక్షితంగా అందిస్తే ఆ వ్యాపారానికి మంచి గిరాకీ ఉంటుందని గుర్తించింది. అదే సమయంలో పెద్దమొత్తంలో డీజిల్ డోర్ డెలివరీకి ప్రభుత్వమూ అనుమతి ఇవ్వడంతో ‘హమ్‌సఫర్’ సంస్థను దిల్లీ కేంద్రంగా మొదలు పెట్టింది సాన్యా. దీనికోసం ‘డోర్‌స్టెప్ డీజిల్ డెలివరీ సర్వీస్’ యాప్‌ని తెచ్చింది. అందులో ఆర్డర్ ఇస్తే కావాల్సిన మొత్తంలో ఉన్న చోటుకే డీజిల్ రప్పించుకునేలా చేసింది. ఇది రైతులు, హౌసింగ్ సొసైటీలు, హోటళ్లు, ఆసుపత్రులు, దుకాణాలు, నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు- ఇలా పెద్ద మొత్తంలో డీజిల్ కొనుగోలుచేసే వారందరి కష్టాల్ని తీర్చేసిందనే చెప్పాలి. డీజిల్ కావలసినవాళ్లు ఒకప్పటిలా బంక్ నుంచి దాన్ని అవసరమైన ప్రాంతానికి తరలించడం కోసం వ్యయప్రయాసలు పడనక్కర్లేదిపుడు. ఒక్క క్లిక్‌తో కావాల్సినంత డీజిల్‌ని ఎక్కడినుంచైనా బుక్ చేసుకుంటున్నారు. కొనుగోలుదారు నమ్మితేనే ఏ వ్యాపారమైనా విజయవంతమవుతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది సాన్యా. తూకంలో, నాణ్యతలో, భద్రతలో జాగ్రత్తలు పాటిస్తూ... ఆర్డర్ పెట్టిన 24 గంటల్లో డీజిల్‌ను తమ ప్రత్యేక ట్యాంకర్లలో చేరవేస్తోంది ‘హమ్‌సఫర్’. ప్రస్తుతం దిల్లీలో డీజిల్ డోర్ డెలివరీ చేసే ఏకైక సంస్థ ఇదే. తర్వాత 12 రాష్ట్రాలకు విస్తరించింది.
మొదట్లో కస్టమర్లకు నమ్మకం కలిగేది కాదు. కానీ దాన్నిప్పుడు సాధించుకున్నాం. త్వరలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాం. ఏదీ అసాధ్యం కాదు. కలల్ని వాస్తవం చేసుకోవడం మన చేతిలో పనే. అప్పటివరకూ ఎవరూ ఆలోచించని కొత్త అంశమైనా సరే గట్టిగా నమ్మి ఆరంభిస్తే సమస్యలున్నా అవే సమసిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!