ఈ డాక్టరమ్మ.. వేలకోట్ల సంస్థను సృష్టించింది!
ఆమె ఓ గైనకాలజిస్టు.. అక్కడితో ఆగిపోతే తన గురించి చెప్పనవసరంలేదు. ఆమె ఓ బిలియన్ డాలర్ కంపెనీ(యూనికార్న్)కి సహ వ్యవస్థాపకురాలు కూడా. ఆ వైద్యురాలూ, వ్యాపారీ డాక్టర్ గరిమా సావణే. భారతీయ అంకుర సంస్థల వ్యవస్థలో ఓ వైద్యసేవల కంపెనీ ఈ స్థాయిని చేరుకోవడం ఇదే ప్రథమం. ఈమె ప్రారంభించిన ‘ప్రిస్టీన్ కేర్’ దేశంలో శస్త్రచికిత్సల తీరునే మార్చేస్తోంది.
ఆమె ఓ గైనకాలజిస్టు.. అక్కడితో ఆగిపోతే తన గురించి చెప్పనవసరంలేదు. ఆమె ఓ బిలియన్ డాలర్ కంపెనీ(యూనికార్న్)కి సహ వ్యవస్థాపకురాలు కూడా. ఆ వైద్యురాలూ, వ్యాపారీ డాక్టర్ గరిమా సావణే. భారతీయ అంకుర సంస్థల వ్యవస్థలో ఓ వైద్యసేవల కంపెనీ ఈ స్థాయిని చేరుకోవడం ఇదే ప్రథమం. ఈమె ప్రారంభించిన ‘ప్రిస్టీన్ కేర్’ దేశంలో శస్త్రచికిత్సల తీరునే మార్చేస్తోంది.
‘వ్యాపారులుగా మారడానికి కావాల్సిన సామర్థ్యాలు మహిళల్లో సహజంగానే ఉంటాయి. కాబట్టి సందేహించకుండా కలల్ని నిజం చేసుకోండి. ఆ ప్రయాణంలో ఎవరికైనా మార్గనిర్దేశం అవసరమే. నమ్మకమైన వారినుంచీ సూచనలూ సలహాలూ తీసుకోండి. వైఫల్యం గురించి భయపడొద్దు’.
పదో తరగతి వరకూ గరిమా సావణే సాధారణమైన అమ్మాయి. పెద్దగా లక్ష్యాలూ, ఆశయాలూ లేవు. ఆ సమయంలోనే ‘లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితేనే జీవితానికి సార్థకత’ అని తండ్రి చెప్పిన మాటలు ఆమెను వైద్యరంగంలో అడుగుపెట్టేలా చేశాయి. వారి కుటుంబం నుంచి ఈమే మొదటి డాక్టర్. నాసిక్‌లోని ‘మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ నుంచి ఎంబీబీఎస్, పుణెలోని ‘భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ’ నుంచి ఎమ్ఎస్(అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ) పూర్తిచేసిన గరిమ.. ఆ సంస్థల్లో వైద్యురాలిగానూ సేవలందించారు. ‘24 గంటలూ అత్యవసర సేవలు, సాయంత్రానికీ తరగని రోగుల క్యూ, డ్యూటీకి రావడమే కానీ ఎప్పుడు తిరిగి వెళ్తామో తెలియని పరిస్థితి. వైద్య కాలేజీలకు అనుబంధంగా ఉండే, ఆసుపత్రుల్లోని ఈ అనుభవాలు డాక్టర్లకి టైమ్మేనేజ్మెంట్ని నేర్పుతాయి. త్వరగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి’ అని చెబుతారు గరిమ. ఇలాంటి ఆసుపత్రుల్లో పనిచేయడం వల్ల వృత్తిలో సంతృప్తి ఉంటుందనేది ఆమె మాట. అక్కడ పనిచేస్తున్నపుడే అసాధ్యం అనుకున్న కేసుల్ని సుసాధ్యం చేయడంతో ఆత్మవిశ్వాసమూ పెరిగిందంటారు. తర్వాత దిల్లీలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో అవకాశం రావడంతో అందులో చేరారు. కానీ అక్కడ సీనియర్ డాక్టర్లు చెప్పింది చేయడం తప్ప రోగులతో మాట్లాడి చికిత్స అందించే అవకాశం లేదు. మంచి జీతం.. అయినా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నాననే అసంతృప్తి. ఈ కారణంగానే ఆ హాస్పిటల్ వదిలి గురుగ్రామ్‌లో ఓ చిన్న గదిలో సొంత క్లినిక్‌ని ప్రారంభించారు. దానికే ‘ప్రిస్టీన్ కేర్’ అని పేరు పెట్టారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలూ చేస్తూ హస్తవాసి బాగున్న వైద్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
వ్యవస్థనే మార్చేశారు
గరిమా భర్త వైభవ్కపూర్ ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సర్జన్. ఇద్దరికీ అప్పటికే వేల సర్జరీలు చేసిన అనుభవం. వైభవ్ బాల్యమిత్రుడైన హర్సిమర్బీర్ సింగ్ తల్లి గైనిక్ సమస్యకు గరిమానే శస్త్రచికిత్స చేశారు. అప్పుడు ఎదురైన అనుభవం వారికో కొత్తదారిని చూపింది. శస్త్రచికిత్స చేసేందుకు గరిమా సిద్ధంగా ఉన్నా, అందుకు హాస్పిటల్లో బెడ్ దొరక్క కొన్ని వారాలు వేచి చూడాల్సి వచ్చింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడంలోనూ ఇబ్బంది పడ్డారు. ‘వైద్య రంగంలో ఉన్నవాళ్లకే ఇన్ని సమస్యలు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?’ అనుకున్నారు. సింగ్‌కు అంకుర సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. అప్పటికే వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న ఆ మిత్ర త్రయం... ఈ సమస్యని పరిష్కరించాలనుకున్నారు. చిన్న నగరాల్లో ఉండే కొన్ని హాస్పిటల్స్ శస్త్రచికిత్సలకు అనుకూలమే అయినా, అక్కడ సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ ఉండదు. 50 బెడ్లు ఉండేచోట సగం కూడా నిండేవి కాదు. ‘అక్కడ వసతులు మెరుగుపర్చి వైద్యులకూ, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తే శస్త్రచికిత్సలకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వేల మందికి సకాలంలో వైద్యం అందుతుంది. ఖర్చూ తగ్గుతుంది’ అనుకున్నారు. ముగ్గురూ కెరియర్ నుంచి విరామం తీసుకుని 2018 ఆగస్టులో గుర్గామ్ర్ కేంద్రంగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరుతో ఈ సేవల్లోకి అడుగుపెట్టారు. భివానీ, పానిపట్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకు వెళ్లి వైద్యులతో ఒప్పందాలు కుదుర్చుకునేవారు. 2019 ఫిబ్రవరిలో ‘సికోయా కేపిటల్’ దీన్లో రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టింది. నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో స్వల్ప వ్యవధిలోనే ఈ సంస్థకు గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు వివిధ సంస్థలు ప్రిస్టీన్లో రూ.750 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. ఈరోజు ప్రిస్టీన్కు వందకుపైగా సొంతంగా, అనుబంధంగా మరో 700 ఆసుపత్రులున్నాయి. 400 మంది సూపర్ స్పెషాలిటీ సర్జన్లు ఉద్యోగులుగా ఉన్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 50 రకాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖ సహా 40 నగరాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ విలువ ఇప్పుడు రూ.11 వేల కోట్లపైనే. వ్యాపార బాధ్యతలు ఎన్ని ఉన్నా వైద్యురాలిగా సేవలందించడమే తనకు సంతృప్తినిస్తుందంటారు గరిమ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!