సాహసమే శ్వాసగా...
అయిదుగురు అక్కాచెల్లెళ్లలో జులిమా రెండో సంతానం. తండ్రి గిరీంద్రనాథ్ డేకా సైనికుడు. మగ పిల్లలకు తీసిపోని విధంగా పిల్లల్ని పెంచారా తల్లిదండ్రులు. జులిమాకి 15 ఏళ్లప్పుడే రాజ్‌దూత్ నడపడం నేర్పించారు గిరీంద్ర. అసోం రాష్ట్రంలో అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో ఉండే కెర్పబాటి జులిమా సొంతూరు. కొండవాలున ఉండే ఆ ఊళ్లో బైక్ నడపడం ఓ సాహసమే. కానీ జులిమాకి అదో ఆటలా ఉండేది తప్ప భయమే లేదు. సాహసాలు చేయాలన్న కోరిక బాగా చిన్నపుడే ఆమెలో మొదలైంది. ఎవరెస్ట్‌ని...
ఆడపిల్ల బైక్ నడపడం అవసరమా..
ఇద్దరు పిల్లలతో వచ్చేసింది ఇప్పుడేం చేస్తుంది..
తన గురించి ఇలాంటి మాటలు ఎన్నో వినింది జులిమా డేకా. అయినా వెనకడుగు వేయకుండా మనసు మాటనే అనుసరించింది. ఈరోజు అడ్వంచర్ స్పోర్ట్స్ సంస్థను నడుపుతూ జాతీయస్థాయిలో అవార్డులు అందుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
అయిదుగురు అక్కాచెల్లెళ్లలో జులిమా రెండో సంతానం. తండ్రి గిరీంద్రనాథ్ డేకా సైనికుడు. మగ పిల్లలకు తీసిపోని విధంగా పిల్లల్ని పెంచారా తల్లిదండ్రులు. జులిమాకి 15 ఏళ్లప్పుడే రాజ్‌దూత్ నడపడం నేర్పించారు గిరీంద్ర. అసోం రాష్ట్రంలో అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో ఉండే కెర్పబాటి జులిమా సొంతూరు. కొండవాలున ఉండే ఆ ఊళ్లో బైక్ నడపడం ఓ సాహసమే. కానీ జులిమాకి అదో ఆటలా ఉండేది తప్ప భయమే లేదు. సాహసాలు చేయాలన్న కోరిక బాగా చిన్నపుడే ఆమెలో మొదలైంది. ఎవరెస్ట్‌ని మొదటిసారిగా అధిరోహించిన టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీల గురించి చదివాక తానూ పర్వతారోహణ చేయాలనుకుంది. పదో తరగతి పూర్తవగానే పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టాక చదువు కొనసాగించి డిగ్రీ పూర్తిచేసింది. భర్తతో సరిపడక పిల్లలిద్దర్నీ తీసుకొని సొంతూరు వచ్చేసింది. అప్పుడే ఇరుగుపొరుగు చాలా మాటలన్నా.. ఆమె పట్టించుకోలేదు. తన కాళ్లమీద తాను బతుకుతూ పిల్లలకు ఏలోటూ లేకుండా చూసుకోవాలనుకుంది. జులిమా స్వభావం తెలిసిన స్నేహితుడు పూర్ణ డేకా తన అడ్వంచర్ స్పోర్ట్స్ కంపెనీలో చేరమన్నాడు. ‘అక్కడ పర్యటకులతో కలిసి రోజూ ట్రెక్కింగ్‌కి వెళ్లాలి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం(ఉల్ఫా)- సభ్యులు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. అయినా భయపడకుండా ట్రెక్కింగ్‌పైన ఇష్టం పెంచుకున్నా’ అని చెప్పే జులిమా 2010లో మనాలీలోని ‘అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్’లో చేరి శిక్షణ తీసుకుంది.
మరిన్ని సాహసాలతో...
జులిమా, పూర్ణ ట్రెక్కింగ్ పర్యటనలు నిర్వహిస్తోన్న బోగామతి ప్రాంతం భూటాన్ సరిహద్దులో ఉంటుంది. అక్కడ ప్రవహించే బరండి నదీ తీరం పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం గమనించారు వీళ్లిద్దరూ. రాఫ్టింగ్, కయాకింగ్, పారాసెయిలింగ్ లాంటి సాహస క్రీడలకూ అవకాశం ఉంటుందని భావించి.. వాటిని నిర్వహించే సంస్థను ప్రారంభించాలనుకున్నారు. బ్యాంకుల్ని సంప్రదించి, ఆరో ప్రయత్నంలో సఫలమయ్యారు. వారు అందించిన రుణంతో 2015లో ‘గ్రీన్ ట్రెక్ అడ్వంచర్’ను మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో జిప్లైనింగ్ని పరిచయం చేసిందీ వీళ్లే. దీంతో పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశీ పర్యటకులూ ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు కూడా. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్’ 2020లో దేశంలోని 20 మంది గురించి ప్రత్యేక వీడియోలు రూపొందించగా అందులో జులిమా కూడా ఉన్నారు. అసోం టూరిజం బెస్ట్ రూరల్ టూరిజం ప్రాజెక్ట్‌గా వీరి సంస్థ ఎంపికైంది. ‘నాకు భయానికి అర్థం తెలీదు. మా అమ్మాయి, మేనకోడలికి కూడా మౌంటెనీరింగ్, రాఫ్టింగ్‌లో శిక్షణ ఇప్పించా. డిగ్రీ చదువుతోన్న మా అమ్మాయి కూడా నాకు సాయపడుతోంది. మారుమూల ప్రాంతంలో పరిమిత వనరులున్నచోట మేం ఇవన్నీ చేస్తున్నాం. మాకంటే మెరుగైన పరిస్థితులే దేశంలో చాలాచోట్ల ఉంటాయి. కాబట్టి మహిళలెవరూ తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దు’ అని చెప్పే జులిమా ఏదో ఒకరోజు ఎవరెస్టునీ అధిరోహిస్తానంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?