రాజకీయం తెలియదు.. అయినా గెలిచింది!
ఉండేదేమో మురికివాడ. ఇల్లేమో పూరి గుడిసె. కనీస సదుపాయాలూ కరవే. ఈ పరిస్థితి మార్చడానికి చదువే మార్గమని కష్టపడింది. తను బయటపడుతుంది సరే.. మరి తోటివారి సంగతి? వాళ్లకీ సాయం అందాలంటే రాజకీయాలే మార్గమని నమ్మింది. కానీ దానిలో ఓనమాలూ తెలియదు.
ఉండేదేమో మురికివాడ. ఇల్లేమో పూరి గుడిసె. కనీస సదుపాయాలూ కరవే. ఈ పరిస్థితి మార్చడానికి చదువే మార్గమని కష్టపడింది. తను బయటపడుతుంది సరే.. మరి తోటివారి సంగతి? వాళ్లకీ సాయం అందాలంటే రాజకీయాలే మార్గమని నమ్మింది. కానీ దానిలో ఓనమాలూ తెలియదు. అయితే ఏంటి సమస్యలపై అవగాహన ఉంది కదా అని ప్రయత్నించింది. మొదటి ప్రయత్నంలోనే డిప్యూటీ మేయర్ అవ్వడమే కాక.. ఒడిశా చరిత్రలోనే ఆ పదవిని అందుకున్న అతి పిన్న వయస్కురాలిగానూ నిలిచింది. గిరిజన అమ్మాయికి ఇదెలా సాధ్యమైందో.. చదివేయండి.
‘నగర సమస్యలు దానిలో నివసించే ప్రజలకు కాక ఇంకెవరికి అర్థమవుతాయి?’ అంటుంది దమయంతి మాఝీ. ఈమెది కటక్‌లోని బాలిసాహి అనే మురికివాడ. చిన్న పూరి గుడిసే ఇల్లు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అమ్మానాన్న ఇద్దరూ దినసరి కూలీలు. అయిదేళ్ల క్రితం నాన్న చనిపోయాక అమ్మతో కలిసి కుటుంబ బాధ్యతలను అందుకుంది. చదువుకోందే భవిష్యత్ లేదని నమ్ముతుందీమె. తను బాగా చదివి, తోబుట్టువులకీ ఆదర్శంగా నిలవాలనుకుంది. అందుకే తను చదువుకుంటూనే పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని తన, తోబుట్టువుల చదువుకు వినియోగించేది. ఇప్పుడామె ఎంకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మున్సిపల్ ఎన్నికల జరుగుతున్నాయని తెలిసి స్థానిక నాయకులను కలిసింది. ‘మా తెగలో పెద్ద చదువులు చదివినవారే లేరు. దాన్ని నేను మార్చాలనుకున్నా. నా ధ్యాస ఎప్పుడూ చదువు మీదే. అమ్మకు తోడు నిలవాలి, నా తోబుట్టువులకు మార్గదర్శిగా ఉండాలనే ఆలోచించేదాన్ని. స్కూలు, కాలేజీ ఎన్నికలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు.. నగర పరిస్థితులు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాలాంటి సామాన్యులకు కాక ఇంకెవరికి తెలుస్తుంది అనిపించింది. ఈ పరిస్థితులను మార్చడానికి నేనే ఎందుకు ముందడుగు వేయకూడదనుకున్నా. నాలాంటి ఎంతోమందికి సాయపడొచ్చు.. ఓసారి ప్రయత్నిద్దామనుకున్నా’ అని వివరించింది దమయంతి. స్థానిక సమస్యలపై ఆమెకున్న అవగాహన, సూచించిన పరిష్కారాలు అక్కడివారిని ఆకట్టుకున్నాయి. దీంతో కార్పొరేటర్ బరిలో దింపారు. తర్వాత డిప్యూటీ మేయర్ అభ్యర్థిగానూ నిలబెట్టారు. ఇక్కడా విజయమే. ఆ పదవిని సాధించిన పిన్నవయస్కురాలు కూడా. ‘ఓవైపు చదువు, మరోవైపు బాధ్యత. రెంటినీ సమన్వయం చేసుకుంటూ వెళతా. చిన్నప్పటి నుంచీ కష్టాల్లోనే పెరిగా. కాబట్టి నాలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నా. ముందు మురికివాడల్లోని వారికి కనీస సదుపాయాలైన తాగునీరు, మురుగునీటి వ్యవస్థని మెరుగుపరచడం, కరెంటు అందివ్వడంపై దృష్టిపెడతా’ అంటోందీ 21 ఏళ్ల అమ్మాయి. ఆల్ ద బెస్ట్ చెబుదామా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!