న్యూస్ రీడర్ కావాలనుకుని.. యూట్యూబర్ అయ్యా!
ఇరవై ఒక్క ఏళ్ల అమ్మాయి... యూట్యూబ్ ఛానెల్ అనగానే.. బ్యూటీ అంశాలు.. ఫ్యాషన్ వగైరా గుర్తొచ్చాయా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే! అత్తాకోడళ్ల గిల్లికజ్జాలు.. సామాజిక అంశాలపై
ఇరవై ఒక్క ఏళ్ల అమ్మాయి... యూట్యూబ్ ఛానెల్ అనగానే.. బ్యూటీ అంశాలు.. ఫ్యాషన్ వగైరా గుర్తొచ్చాయా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే! అత్తాకోడళ్ల గిల్లికజ్జాలు.. సామాజిక అంశాలపై సందేశాలు.... ఇలా మనం పట్టించుకోని చిన్న చిన్న అంశాలే కనిపిస్తాయి తన వీడియోల్లో. అన్నీ సీరియస్ విషయాలే అనుకున్నారో.. మళ్లీ పొరబడ్డట్టే. సందేశాన్నీ సరదాగా అందిస్తూ... చిలిపిగా, గలగలా మాట్లాడేస్తూ లక్షల మందిని ఆకట్టుకుంటోంది జ్యోత్స్న.. ఈ హైదరాబాదీని వసుంధర పలకరిస్తే.. తన గురించి చెప్పుకొచ్చిందిలా..!
కాస్త తెలంగాణ యాస.. నా గలగలా మాట్లాడే తీరుకి చాలామంది ముచ్చటపడతారు. కానీ.. ఒకప్పుడు మాట పెగిలేది కాదు. ఇలాగైతే కష్టం కదా! అసలే నాకు న్యూస్ రీడర్ అవ్వాలని కోరిక. అందుకే నన్ను నేను మార్చుకోవాలనుకున్నా. మాది హైదరాబాద్. నాన్న రామిరెడ్డి, తపాలాశాఖ ఉద్యోగి. అమ్మ సంగీత బొతిక్ నిర్వహిస్తుంది. ఇంటర్ వరకూ ఇక్కడే చదివా. డిగ్రీకి భువనేశ్వర్ వెళతానన్నా. ఇంట్లో ఒప్పుకోలేదు. పైగా నాకు హిందీ రాదు. ఇంగ్లిషూ అంతంత మాత్రమే. మెరిట్ విద్యార్థినీ కాదు. అయినా ఎందుకు పట్టుబట్టానంటే.. కొత్త ప్రదేశం, తెలియని భాష, కొత్త విషయాలతోపాటు నాపై నేను ఆధారపడటం నేర్పుతాయని! ఎంచుకున్నది కూడా జర్నలిజం అండ్ మాస్‌కమ్యూనికేషన్. ఇంజినీరింగ్, మెడిసిన్.. లాంటివి నాకు సరిపడవన్నా. నా పట్టుదల చూసి సరేనన్నారు. నచ్చిన విద్య కదా.. ఇష్టపడి చదివా.
వాటితో పేరొచ్చింది..
యూట్యూబ్ ప్లాన్ చేసుకున్నది కాదు. న్యూస్‌రీడర్ కావడానికి ఫేమ్ కావాలనుకొని టిక్‌టాక్‌లోకి వచ్చా. మొదట్లో లిప్ సింక్లే చేసేదాన్ని. ఓసారి మా అమ్మ ‘అలా చేస్తే నీ ప్రత్యేకతేముంది? కొత్తగా ప్రయత్నించు’ అని కొన్ని సలహాలూ ఇచ్చింది. అప్పుడిక మోటివేషనల్ వీడియోలు మొదలుపెట్టా. ఫాలోయర్లు పెరిగాక ఇన్స్టాగ్రామ్, 2020లో ‘జ్యోత్స్న 28’ పేరుతో యూట్యూబ్లోకీ వచ్చా. పూర్తిగా దృష్టి పెట్టింది మాత్రం ఈ జనవరి నుంచే. 3 రకాల వీడియోలు చేస్తున్నా. అమ్మతో కలిసి అత్తా కోడళ్ల మీద సిరీస్. దీనికి బాగా పేరొచ్చింది. వివిధ అంశాలపై నా అభిప్రాయాలు, తాజా ట్రెండ్లపై కొన్ని. రోజువారీ జీవితంలో నాకు అనుభవమైనవే అంశాలుగా తీసుకుంటా. ప్రతిదానికీ హాస్యం చేర్చినా, అంతర్లీనంగా సందేశం ఉంటుంది. దేన్నైనా భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తా. కాన్సెప్టు నుంచి ఎడిటింగ్ వరకూ అన్నీ నేనే. మోటివేషనల్ అంశాల విషయంలో అమ్మ సాయం తీసుకుంటా. నా దుస్తులూ తనే డిజైన్ చేస్తుంది. వీడియోలను ఫోన్లోనే తీస్తా. అమ్మా, అప్పుడప్పుడూ నాన్న కూడా తీస్తారు. మొదట్నుంచీ బంధువుల్లో చాలామంది వ్యతిరేకించారు. మాది మధ్యతరగతి కుటుంబం మరి. ఇలా వీడియోల్లో కనిపిస్తోంటే పెళ్లవదని వాళ్ల భయం. ఎవరేమన్నా అమ్మానాన్నా తోడు నిలిచారు. స్నేహితులు కూడా. కాస్త పేరొచ్చాక కొందరు ప్రోత్సహించినా వ్యతిరేకించే వారూ ఉన్నారు. చేసేది తప్పు కానప్పుడు ఎందుకు భయపడాలి? అయినా యూట్యూబ్ నా సృజనాత్మకతను ప్రదర్శించే మార్గం. కెరియర్ లక్ష్యం మాత్రం న్యూస్ రీడరవ్వడమే. పీజీ కూడా చేస్తా. యూట్యూబ్‌లో మిలియన్ ఫాలోయర్లకు చేరుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిపై పనిచేస్తున్నా.
వాళ్లతో అయితే చేస్తా..
నా ఛానెల్‌కు నాలుగు లక్షలకుపైగా ఫాలో యర్లున్నారు. రోజుకో వీడియో చేస్తా. ఆలోచన రాగానే రాసిపెట్టుకొని, నెమ్మదిగా తీర్చిదిద్దుతా. నేను చేసిన వాటిలో 80కిపైగా వీడియోలు మిలియన్ వీక్షణల మార్కు దాటాయి. నెగెటివ్ కామెంట్లూ వస్తుంటాయి. సలహాలను ప్రయత్నిస్తా. పనిగట్టుకుని చేసే విమర్శలను పట్టించుకోను, కానీ అమ్మ బాధపడుతుంది! ఇవన్నీ సహజమని సర్ది చెబుతా. సినిమా, వెబ్ సిరీస్ ఆఫర్లూ వచ్చాయి. ఆడిషన్లో అంతమంది ముందు నటించడం ఇబ్బందనిపించి చేయనన్నా. ప్రభాస్, అల్లు అర్జున్‌కి చెల్లెలిగా అవకాశమొస్తే మాత్రం చేస్తా. జానపద కవర్ సాంగ్‌లనూ చేస్తున్నా. నేనింతగా మారిపోవడం అందరికీ ఆశ్చర్యమే. మా అమ్మ ‘నువ్వు నా కూతురివేనా?’ అని ఎన్నిసార్లు అడిగిందో. ఇదంతా భువనేశ్వర్‌లో నా రూమ్మేట్ల చలవ, అమ్మ ప్రోత్సాహం. అమ్మాయి అనుకుంటే ఏదైనా చేయగలదు. తనకు కెరియర్, ఆశలు, ఆశయాలు ఇలా బోలెడుంటాయి. కాస్త ప్రోత్సాహం, స్వేచ్ఛ ఇస్తే చాలు. ఇందుకు నేనే ఉదాహరణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!