పట్టుదల ముందు పేదరికం చిన్నబోయింది!
వాళ్ల జీవితం వడ్డించిన విస్తరి కాదు. అడుగడుగునా ముళ్లబాటలే స్వాగతం పలికాయి. అయినా సరే కష్టం, ఆకలి, గెలవాలన్న కసినే ఇంధనంగా మార్చుకుని ముందుకు నడిచారు. తమ గెలుపు కథతో దేశాన్ని తమవైపుకి తిప్పుకున్నారు.
వాళ్ల జీవితం వడ్డించిన విస్తరి కాదు. అడుగడుగునా ముళ్లబాటలే స్వాగతం పలికాయి. అయినా సరే కష్టం, ఆకలి, గెలవాలన్న కసినే ఇంధనంగా మార్చుకుని ముందుకు నడిచారు. తమ గెలుపు కథతో దేశాన్ని తమవైపుకి తిప్పుకున్నారు.
నీళ్ల అన్నం తిని...
బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంతగా అది ముందుకు దూసుకుపోతుంది! అనిత కూడా ఎక్కుపెట్టిన బాణమే! ఆకలి, వివక్ష ఆమెని వెనక్కిలాగాలని ప్రయత్నించినా చివరికి ఆమె సంకల్పం ముందు ఓడిపోయి సలామ్ చెప్పాయి. పదిహేడేళ్ల అనితాకుమారివైపు దేశం మొత్తం ఇప్పుడు ఎందుకు తిరిగి చూస్తోందో తెలుసా?
ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లోనే జరిగే అండర్-17 వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ పోటీల్లో పదహారు దేశాలు పాల్గొంటాయి. మనదేశం నుంచి పాల్గొనే జట్టు కోసం.. 33 మంది అమ్మాయిలని శిక్షణకు ఎంపిక చేస్తే అందులో ఏడుగురు ఝార్ఖండ్ ఆడబిడ్డలే. అందరూ పేదింటి గిరిజన పిల్లలే. ఒక్కొక్కరిది ఒక్కో స్ఫూర్తి గాథ. వాళ్లలో అనిత కథ మరింత ప్రత్యేకం. ఆమె స్వస్థలం రాంచీ దగ్గరున్న ఓర్మంచీ గ్రామం. ఐదుగురు ఆడపిల్లల్లో నాలుగో అమ్మాయి. తండ్రి తాగుబోతుగా మారి ఇంటిని పట్టించుకోకపోతే కూలీగా మారి ఆ బాధ్యతని భుజాలకెత్తుకుంది తల్లి ఆశాకుమారి. చిన్నవయసులోనే ముగ్గురాడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేసింది. అనితని మాత్రం పెళ్లికి ఒప్పించలేకపోయింది. కారణం... అనితకి ఫుట్‌బాల్ అంటే ప్రాణం. అదే ప్రాంతానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆనంద్ ప్రసాద్ గోపే 250 మంది ఆడపిల్లలకు ఈ ఆటలో శిక్షణ ఇస్తే... అనిత అతను కోరుకున్న క్రీడాకారిణిగా ఎదిగింది. కానీ ఇందుకోసం పరిస్థితులతో పెద్ద యుద్ధమే చేస్తోంది. ఆటలో రాణించడం అంటే మాటలు కాదు. పోషకాహారం ఉండాలి, సరైన సదుపాయాలు కావాలి. కానీ అన్నం, కూరల్లో... అన్నం గురించి మాత్రమే తెలుసు అనితకి. కేవలం నీళ్లు పోసిన అన్నంతో సరిపెట్టుకుంటూ ఎనిమిదేళ్లుగా ఆ ఆట ఆడుతోంది. తన ప్రతిభని గుర్తించి స్థానికులు చేసే సాయంతో ఆటకు కావాల్సిన జెర్సీ, షూస్ వంటివి కొనుక్కునేది. పేదరికం కన్నా ఆమె ఎదుర్కొన్న పెద్ద సమస్య వివక్ష. ‘ఇలా తొడలు కనిపించేలా చెడ్డీలు వేసుకుని ఆడితే మన ఊరికి చెడ్డపేరు వస్తుంది. ఇక ఈ ఊరు ఆడపిల్లలని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పనిలోకి పంపితే నాలుగు రూపాయలు వస్తాయి. కట్నం డబ్బు జమ అవుతుందిగా!’ అని ఊరివాళ్లంతా అన్నా వినిపించుకోకుండా తన కూతురు ఆశయానికి అండగా నిలబడింది ఆశ. ‘మాటలతో లాభం లేదనుకున్నారేమో... నేను సాధన చేసే మైదానంలో గాజు పెంకులు చల్లేవారు’ అనే అనిత ఈ పరిస్థితులకి ఏమాత్రం బెదిరిపోలేదు సరికదా తన చెల్లెలు వినీతని కూడా ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా తీర్చిదిద్దింది. తుది జుట్టులో ఎంపిక కోసం శ్రమిస్తున్న ఈ అమ్మాయి ఆటని చూడ్డానికి వాళ్లింట్లో టీవీకానీ, మొబైల్కానీ లేవు. ‘వాటి అవసరం మాకు ఇంతవరకూ రాలేదంటోంది’ అనిత తల్లి..
ఈ ఛాంపియన్‌కు వాడంతా అండ!
‘ఏదైనా బలంగా కోరుకున్నపుడు.. అది సాధించడానికి ప్రపంచం మొత్తం నీకు తోడై వస్తుంది’ అన్న పాలో కొయిలో మాటల్ని మిర్యాల అనూష బలంగా నమ్మింది. హోటల్లో పనిచేస్తూ తనని బాగా చదివించాలనుకున్న అమ్మ కలని నిజం చేయాలనుకుంది. అలాగని తన సొంత కలలని వదులుకోలేదు. వెయిట్ లిఫ్టర్‌గా రాణిస్తూ తాజాగా జాతీయ ఛాంపియన్‌గా ఎదిగింది ఖమ్మం జిల్లాకు చెందిన ఈ 18 ఏళ్ల అమ్మాయి..
కేరళలో ఇటీవల జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్(సబ్ జూనియర్) పోటీల్లో 63 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది అనూష. ఈ విజయం ఆమెకంత సులభంగా దక్కలేదు. తండ్రి చనిపోవడంతో, తల్లి ఓ హోటల్లో పనిచేస్తూ అనూషని చదివించింది. చిన్న రేకుల ఇంట్లో ఉంటూనే అటు చదువుల్లోనూ, ఇటు క్రీడల్లోనూ రాణించేది. ఖమ్మంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు ఓసారి స్కూల్ పోటీల్లో బరువులెత్తింది. అది చూసిన పీఈటీ వినోద్‌కుమార్ ఆమెలో ప్రత్యేకతని గమనించి ప్రోత్సహించారు. ఆయన కూడా సీనియర్ వెయిట్‌లిఫ్టర్. అనూష క్రీడల్లోకి వెళ్తానంటే తల్లి స్రవంతి మొదట వద్దంది. కానీ కోచ్ వినోద్‌తోపాటు తెలిసినవాళ్లంతా సాయం చేస్తామనడంతో ఒప్పుకొంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆటను కొనసాగిస్తూనే వచ్చింది అనూష. రాష్ట్రస్థాయిలో 14 సార్లు పోటీ పడగా 13 స్వర్ణాలు అందుకుంది. తొమ్మిది సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. కొవిడ్-19కు ముందు ఆరు నెలలపాటు ‘శాయ్’ బెంగళూరు శిబిరంలో శిక్షణ తీసుకుంది. 2020-ఖేలో ఇండియా పోటీల్లో నాలుగో స్థానంలో, గతేడాది బెంగళూరులో జరిగిన విశ్వవిద్యాలయాల ‘ఖేలో ఇండియా’ పోటీల్లో ఆరో స్థానంలో నిలిచింది. కొవిడ్ కాలంలోనూ సాధన కొనసాగిస్తూ వచ్చింది అనూష. పాత సామాగ్రితో ప్రాక్టీసు చేస్తుండటం చూసి వీరయ్య, తిరుమలరావు అనే సోదరులు రూ.లక్ష పెట్టి కొత్త సామాగ్రి కొనిచ్చారు. ఆ తర్వాత ఆమె ప్రదర్శన ఎంతో మెరుగైంది. పర్యటనలు, ఆహార ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని రవికుమార్, వంశీ, నాగార్జున... అందిస్తున్నారు. పొరుగున ఉండే సుజన్ అయితే గుడ్లు, మాంసాహారం వండి పెడుతుంటుంది. జాతీయ ఛాంపియన్‌గా హాంకాంగ్‌లో జరిగే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది అనూష. ‘అక్కడ నెగ్గాలంటే ఇంకా మెరుగైన ఆహారం, శిక్షణ తీసుకోవాలి. ప్రస్తుతానికయితే పరిమిత వనరులతోనే సాధన చేస్తున్నా’ అంటోంది అనూష.
- అర్జున్‌సింగ్ రాజ్‌పుత్, ఖమ్మం
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాం, సిగ్నల్ల ద్వారా పంపవచ్చు. ఈ నంబరు కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!