స్ఫూర్తి నింపారు..

మన దేశంలోనే అగ్రగామి పారిశ్రామికవేత్తల భార్యలు వీళ్లు. మందీమార్బలం ఎంతున్నా.. తల్లిగా పిల్లల పెంపకంలో క్రమశిక్షణ నేర్పారు. వ్యక్తులుగా తీర్చిదిద్ది కెరియర్‌లో ఉన్నత స్థానాలను చేరుకునేలా చేశారు. అమ్మల నుంచి నేర్చుకున్న పాఠాలను కూతుళ్లు చెప్పుకొచ్చారిలా..

Updated : 08 May 2022 00:25 IST

మన దేశంలోనే అగ్రగామి పారిశ్రామికవేత్తల భార్యలు వీళ్లు. మందీమార్బలం ఎంతున్నా.. తల్లిగా పిల్లల పెంపకంలో క్రమశిక్షణ నేర్పారు. వ్యక్తులుగా తీర్చిదిద్ది కెరియర్‌లో ఉన్నత స్థానాలను చేరుకునేలా చేశారు. అమ్మల నుంచి నేర్చుకున్న పాఠాలను కూతుళ్లు చెప్పుకొచ్చారిలా..


‘టైగర్‌ మామ్‌’.. ఇషా అంబానీ

మమ్మల్ని పెంచడం కోసం అమ్మ (నీతా అంబానీ) తన పనులన్నీ కొన్నేళ్లు పక్కన పెట్టేసింది. ఆమె ‘టైగర్‌ మామ్‌’. మేం స్కూల్‌ స్థాయికి వెళ్లిన తర్వాత తను ఆఫీస్‌కు వెళ్లేది. అక్కడి నుంచీ తరచూ ఫోన్‌ చేసి మేమెక్కడ ఉన్నామో ఆరా తీసేది. ఒక్కరోజు కూడా బడి మానకూడదు. చాలా కఠినమైన క్రమశిక్షణతో మమ్మల్ని పెంచింది. అవసరానికి మించి పాకెట్‌మనీ ఇచ్చేదికాదు. డబ్బు ఎక్కువగా చేతిలో ఉంటే అది పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుందని చెప్పేది. మమ్మల్ని మధ్యతరగతి పిల్లల్లాగే పెంచాలనుకుంది. ప్రతి వ్యక్తికీ హద్దులుండాలంటుంది. ఇవన్నీ మాకు ఆమె ఇచ్చిన మంచి అలవాట్లు. ఆమె నేర్పిన పాఠాలు నా పిల్లల పెంపకంలో ఉపయోగపడతాయి. నాకు మంచి స్నేహితురాలిగానూ మెలుగుతుంది. నా పెళ్లైనా రోజూ ఇద్దరం మాట్లాడుకుంటాం. వీలున్నప్పుడు కలుస్తుంటాం. ఇప్పటికీ ఆమె నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటా. నా స్ఫూర్తి ఆమె.


తనే నా ధైర్యం... అనన్యా బిర్లా

శారీరక సామర్థ్యంలో మా అమ్మ (నీరజా బిర్లా) చాలా శక్తివంతురాలు. రోజూ వ్యాయామం, తరచూ పర్వతారోహణ చేస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపుటలవాట్లు ఉండాలని, మమ్మల్ని అలానే పెంచింది. ఆరుతరాల నుంచి మా కుటుంబంలో అందరూ వాణిజ్యవేత్తలే. నేను, గాయనిగా కెరియర్‌ను ఎంచుకున్నప్పుడు చాలామంది విమర్శించారు. అమ్మ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నన్ను, చెల్లెలు, తమ్ముడినీ సమానంగా పెంచింది. ఆమె వాయించే సంతూర్‌ వింటూ పెరిగా. అదే నాకు సంగీతంపై ఆసక్తి కలిగేలా చేసింది. తన సామాజిక సేవలు చూసి మాకూ ఆ బాటన సాగాలన్న ప్రేరణ కలిగింది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని అందించింది. విజయం దానంతటదే రాదు, కఠోర శ్రమ చేస్తేనే దక్కుతుంది అనేది. నాణానికి ఇరువైపులా ఉండే విజయం, ఓటమిని మనం ఎంపిక చేసుకోవడంలో ఉంటుందని, మన కృషి మాత్రమే విజేతగా నిలబెడుతుందంటుంది. నా విజయం వెనుక స్ఫూర్తి అమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్