శిఖరమంత సాహసం

వాళ్ల అచంచల ఆత్మవిశ్వాసం ముందు ఆ పర్వతరాజం చిన్నబోయింది... వాళ్ల గుండె ధైర్యానికి సలాం చేస్తూ ఆ మంచుకొండ... మనసు మార్చుకొని వెన్నెల కొండగా మారి తన శిరసుపై స్థానం ఇచ్చింది. ప్రపంచానికి వాళ్ల గొప్పతనం తెలుపుతూ కీర్తిశిఖరాలకు చేర్చింది.

Published : 29 May 2022 01:22 IST

వాళ్ల అచంచల ఆత్మవిశ్వాసం ముందు ఆ పర్వతరాజం చిన్నబోయింది... వాళ్ల గుండె ధైర్యానికి సలాం చేస్తూ ఆ మంచుకొండ... మనసు మార్చుకొని వెన్నెల కొండగా మారి తన శిరసుపై స్థానం ఇచ్చింది. ప్రపంచానికి వాళ్ల గొప్పతనం తెలుపుతూ కీర్తిశిఖరాలకు చేర్చింది. 1975లో తొలి మహిళ కాలుమోపిన తరువాత ఇప్పటి వరకూ దాదాపు ఏడువందల మందికి పైగా నారీమణులను గుండెలకు హత్తుకొందీ ఎవరెస్ట్‌ శిఖరం.. వరల్డ్‌ ఎవరెస్ట్‌ డే సందర్భంగా కొందరు సాహసుల విశేషాలివీ...

1975: జపాన్‌కు చెందిన టీచర్‌, ఓ బిడ్డకు తల్లైన జంకో తబే ఎవరెస్టునెక్కిన తొలి మహిళగా నిలిచింది. ఈవిడ ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలన్నీ అధిరోహించింది.

1984: మే 24: బచేంద్రిపాల్‌ ఎవరెస్టుపై అడుగుపెట్టిన తొలి భారతీయురాలు. అప్పటికి తనకు 29 ఏళ్లు. ఓ కుగ్రామంలో రైతు కుటుంబం నుంచి వచ్చారీవిడ.

2004: జపాన్‌కు చెందిన వైద్యురాలు షోకో ఒటా తన 63వ ఏట ఎవరెస్టును అధిరోహించి, తిరుగు ప్రయాణంలో ఆక్సిజన్‌ సమస్య ఎదురవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ ఈవిడే పెద్దావిడ.

2011: ఒకే సీజన్‌లో రెండు సార్లు ఎవరెస్టునెక్కిన తొలి మహిళగా అన్షూ జమ్‌సేన్పా నిలిచారు.

2013: అరుణిమ సిన్హా 26 ఏళ్ల వయసులో కృత్రిమ కాలితో ఎవరెస్టుని అధిరోహించారు. కృత్రిమ అవయవంతో పర్వతారోహణ చేసిన తొలి యువతిగానూ నిలిచారీ పద్మశ్రీ అవార్డు గ్రహీత.

2013: ఎవరెస్టు సహా అయిదు ఎత్తైన పర్వత శిఖరాలెక్కిన తొలి భారత యువతిగా చరిత్రకెక్కి, టెంజింగ్‌ నార్గే సాహస పురస్కారాన్నీ.. దక్కించుకున్నారు ప్రియాంకా మొహితే.

2013: కోడిగుడ్లు విక్రయించే తుసీదాస్‌ ఎవరెస్ట్‌నెక్కి లక్ష్యాన్ని సాధించారు. 

2014: 13 ఏళ్ల, 11 నెలల వయసులోనే అధిరోహించి, అతి చిన్నవయసులో ఎవరెస్టునెక్కిన అమ్మాయిగా తెలుగమ్మాయి మాలావత్‌పూర్ణ రికార్డు సృష్టించింది.

2016: ఎవరెస్టును అధిరోహించిన తొలి పోలీస్‌ అధికారిగా జి.ఆర్‌.రాధిక నిలిచారు.

2021: త్సాంగ్‌ ఇన్‌ హంగ్‌ 25 గంటల 50 నిమిషాల్లో అతి వేగంగా శిఖారాగ్రాన్ని చేరుకుని రికార్డు సృష్టించారు.

2022: 24 ఏళ్ల పడమటి అన్వితారెడ్డి మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించింది.

2022: 10 సార్లు ఎవరెస్టునెక్కిన మహిళగా నేపాల్‌కు చెందిన లక్పా షెర్పా నిలిచారు. 

2022: ప్రాథమిక హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు, పియాలీ బాసక్‌ తాజాగా సప్లిమెంటరీ ఆక్సిజన్‌ సాయం లేకుండానే ఎవరెస్టునెక్కి చరిత్ర సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్