చిట్టి ప్రాణాలకు రక్షగా ఉంటా

చిన్నపిల్లలంటే మనలో చాలామందికి ఇష్టం. ఆ ఇష్టంతో వారి కోసం ఏం చేస్తాం? ఆడిస్తాం... వాళ్లకి¨ నచ్చిన పనులు చేస్తాం... అడిగినవి కొనిపెడతాం. కానీ యాళ్ల హర్షిత మాత్రం ఆ చిన్ని ప్రాణాలు నిలబెట్టాలన్న సంకల్పంతో వైద్యవృత్తిని ఎంచుకుంది. ఎంబీబీఎస్‌లో అత్యద్భుత ప్రతిభ చూపి ఆరు బంగారు పతకాలు సాధించింది. తాజాగా జాతీయ స్థాయి పీజీ నీట్‌ ఫలితాల్లో మూడో ర్యాంకు అందుకుంది.

Published : 04 Jun 2022 01:12 IST

చిన్నపిల్లలంటే మనలో చాలామందికి ఇష్టం. ఆ ఇష్టంతో వారి కోసం ఏం చేస్తాం? ఆడిస్తాం... వాళ్లకి¨ నచ్చిన పనులు చేస్తాం... అడిగినవి కొనిపెడతాం. కానీ యాళ్ల హర్షిత మాత్రం ఆ చిన్ని ప్రాణాలు నిలబెట్టాలన్న సంకల్పంతో వైద్యవృత్తిని ఎంచుకుంది. ఎంబీబీఎస్‌లో అత్యద్భుత ప్రతిభ చూపి ఆరు బంగారు పతకాలు సాధించింది. తాజాగా జాతీయ స్థాయి పీజీ నీట్‌ ఫలితాల్లో మూడో ర్యాంకు అందుకుంది.

ర్షిత వాళ్ల నాన్న శ్రీనివాసరావు వెటర్నరీ అసిస్టెంట్‌, అమ్మ కాంతామణి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో చిరుద్యోగి. వీళ్లది కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెం. హర్షిత పదో తరగతి వరకూ జిల్లా పరిషత్తు పాఠశాలలోనే చదివింది. పదో తరగతిలో 9.3 గ్రేడ్‌ సాధించిన హర్షిత చిన్నప్పట్నుంచీ వైద్యురాలు అవ్వాలనుకునేది. ఇంటర్లో 983 మార్కులు, ఎంసెట్‌లో 183వ ర్యాంకు సాధించింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌(2016-2022) పూర్తి చేసింది. సర్జరీ విభాగంలో 3, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌ విభాగాల్లో ఒక్కొక్కటీ చొప్పున మొత్తం ఆరు పసిడి పతకాలతో మెడిసిన్‌లో మెరిసింది.

రాత్రింబవళ్లూ చదివి...

నీట్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంతోపాటు ఎయిమ్స్‌ (న్యూ దిల్లీ) నిర్వహించే ఐఎన్‌ఐ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంపార్టెన్స్‌) సెట్‌లో 47వ ర్యాంకు సాధించింది. ‘ఈ పరీక్షల కోసం రోజుకు 10-12 గంటలు చదివేదాన్ని. స్నేహితులతో బృంద చర్చల ద్వారా కొత్త అంశాలపై పట్టు సాధించా. కొత్త, క్లిష్టమైన అంశాల్ని చదివేందుకు తెల్లవారు జామున, పునశ్చరణకు రాత్రి సమయాన్ని వినియోగించేదాన్ని. కుటుంబ సభ్యులతో మాట్లాడే కొద్ది నిమిషాలు తప్ప మిగిలిన సమయాల్లో సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండేదాన్ని’ అంటూ తన ప్రిపరేషన్‌ గురించి చెప్పే హర్షిత.. కరోనా సమయంలో కాకినాడ జీజీహెచ్‌లో రోగులకు సేవలందించింది. ఆ క్రమంలో తనూ కొవిడ్‌ బారిన పడింది. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నా.. తన అనుభవం, వైద్యుల సలహాలతో కోలుకుంది. మళ్లీ కొవిడ్‌ విధుల్లో చేరి ఎందరో కరోనా రోగుల ప్రాణాలు కాపాడింది. ప్రఖ్యాత చండీగఢ్‌ వైద్య కళాశాలలో పీడియాట్రిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసి చిన్నారులకు మంచి వైద్యం అందించాలన్న తన కల నెరవేర్చుకుంటానంటోంది హర్షిత.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్