పల్లెపల్లెకూ కూచిపూడిని చేర్చాలని!
అమ్మకలని నెరవేర్చడం కోసం కాలికి గజ్జె కట్టింది. తర్వాత అదే ఆమె లోకమైంది. వెయ్యికిపైగా కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చిన ఈ అమ్మాయి విదేశాల్లోని తెలుగువారికి నాట్యపాఠాలూ చెబుతోంది. అంతేనా... గానం, గిటార్, వీణల్లోనూ పట్టు సంపాదించింది. తాజాగా సినిమాల్లోనూ అవకాశం దక్కించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నిహంత్రీరెడ్డి వసుంధరతో ముచ్చటించింది..
అమ్మకలని నెరవేర్చడం కోసం కాలికి గజ్జె కట్టింది. తర్వాత అదే ఆమె లోకమైంది. వెయ్యికిపైగా కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చిన ఈ అమ్మాయి విదేశాల్లోని తెలుగువారికి నాట్యపాఠాలూ చెబుతోంది. అంతేనా... గానం, గిటార్, వీణల్లోనూ పట్టు సంపాదించింది. తాజాగా సినిమాల్లోనూ అవకాశం దక్కించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నిహంత్రీరెడ్డి వసుంధరతో ముచ్చటించింది..
మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మంగంపేట (అన్నమయ్య జిల్లా). పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లో. నాన్న మురళీమోహన్ ఐఈఎస్ సర్వీస్‌కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వ్యాపారం చేస్తున్నారు. అమ్మ ఉషారెడ్డి. ఆమెకు గొప్ప నాట్యకారిణి కావాలని ఉండేది. దాంతో మూడో ఏట నుంచే నన్ను నాట్యం వైపు మళ్లించింది. ప్రఖ్యాత నాట్య విద్వాంసులు, దివంగత వెంపటి రవిశంకర్, పద్మశ్రీ శోభానాయుడు వంటి వారి శిష్యరికం చేశాను. పోపూరి శ్రీనివాసశర్మగారి వద్ద వీణలో శిక్షణ తీసుకొన్నా. శోభానాయుడుతో కలిసి కోణార్క్, ఖజురహో, టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఈశా వంటి ప్రతిష్ఠాత్మక వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చా. కళ మాత్రమే కాదండోయ్... చదువుపైనా దృష్టి పెట్టాను. ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ నుంచి బీబీఏ చేశా. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్ అభ్యసిస్తున్నా. నా నృత్య రూపకాల్లో ‘హోలికా దహనం’, ‘చండాలి’, ‘నవరస నటభామిని’, ‘సర్వం సాయిమయం’, ‘జగదానందకారక’ వంటివి మంచి పేరు తెచ్చాయి. ఇవి చూసిన దర్శకులు బీఎన్ ఆదిత్య తన సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. జయప్రద, రాజేంద్రప్రసాద్ వంటి వారు నటిస్తున్న ‘లవ్జీ65’ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నా.
గ్రామీణ బాలికల కోసం.. ఇప్పటి వరకు సింగపూర్, దుబాయ్, శ్రీలంక సహా పలు దేశాల్లో 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. 2012లో ఆల్‌రౌండర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించా. 2014లో తెలంగాణ ప్రభుత్వం నుంచి స్త్రీశక్తి పురస్కారం అందుకున్నా. అన్నింటికంటే ఎక్కువగా 2018లో మా గురువు శోభానాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వంగా అనిపించింది. ఏదో ఒక కళకే పరిమితమయిపోవడం నాకిష్టం లేదు. అందుకే గాయనిగా, గిటారిస్టుగా, వీణా విద్వాంసురాలిగానూ పేరు తెచ్చుకున్నా. షూటింగ్‌లోనూ ప్రవేశం ఉంది. విదేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లేటప్పుడు అమ్మ తోడుగా ఉంటుంది. కష్టపడి నేర్చుకున్న విద్యని పదిమందికీ నేర్పాలని మణికొండలో అకాడమీ ప్రారంభించాను. 2015 నుంచీ ఈ కళ పట్ల ఆసక్తి ఉన్న అమ్మాయిలకు శిక్షణ ఇస్తున్నా. ఆస్ట్రేలియా, అమెరికాలో ఉంటున్న వారికి ఆన్లైన్లో నేర్పిస్తున్నా. ఇటీవలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకు దిల్లీ వెళ్లి ప్రదర్శన ఇచ్చినప్పుడు... ఆయనిచ్చిన ప్రశంసలు జీవితంలో మర్చిపోలేను. ఓ స్వచ్ఛంద సంస్థని స్థాపించి గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలకూ కూచిపూడి నేర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా.
దేన్నైనా ఎంచుకుంటే చివరి వరకూ కొనసాగించాలనేది మా అమ్మ. అదే భిన్న అంశాల్లో రాణించడానికి కారణమైంది. మా గురువుగారి దగ్గరికి నృత్యం నేర్చుకోవడానికి భిన్న రంగాల ప్రముఖులు వచ్చేవారు. వాళ్లని చూసి పెద్దయ్యాక నేనూ అలా అవ్వాలనుకునేదాన్ని. దీంతో చేసే ప్రతిదాన్నీ ప్రేమించడం అలవాటైంది. ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గం. వరకు తీరక లేకుండా ఉన్నా తెలియని ఆనందం. మెచ్చిన దాన్ని ఎంచుకుంటే ఎవరైనా అంతే! తప్పక రాణిస్తారు. అయితే డబ్బు, పేరుకు వెంపర్లాడక నలుగురికీ ఉపయోగపడాలన్నది మా గురువు గారి సూచన. దాన్నీ అనుసరిస్తున్నా.
- మల్లిక్ బస్వోజు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!