శభాష్ మోనికా..
పైలట్లు ఎంతటి అనుభవజ్ఞులైనా, సుశిక్షితులైనా.. సకాలంలో చాకచక్యంగా వ్యవహరిస్తేనే ఆకాశవీధిలో ప్రమాదాలు తప్పేది. పైలట్ మోనికా ఖన్నా ఇలాంటి ప్రతిభనే చూపింది. ఇటీవల ఆమె కెప్టెన్‌గా ఉన్న విమానం ఇంజిన్‌కి నిప్పు
పైలట్లు ఎంతటి అనుభవజ్ఞులైనా, సుశిక్షితులైనా.. సకాలంలో చాకచక్యంగా వ్యవహరిస్తేనే ఆకాశవీధిలో ప్రమాదాలు తప్పేది. పైలట్ మోనికా ఖన్నా ఇలాంటి ప్రతిభనే చూపింది. ఇటీవల ఆమె కెప్టెన్‌గా ఉన్న విమానం ఇంజిన్‌కి నిప్పు అంటుకోగా కొన్ని నిమిషాల్లో దాన్ని తిరిగి ల్యాండింగ్ చేసి 185 మంది ప్రయాణికుల్ని కాపాడింది. దాంతో ‘శభాష్ మోనికా’ అని మెచ్చుకుంటున్నారందరూ.
మోనికా ఖన్నాది పంజాబ్. ఎంబీఏ పట్టా తీసుకుంది. పర్యటనలు, ఆకాశ యానాలు అంటే అమితమైన ఇష్టం. అందుకే పైలట్ కెరియర్ను ఎంచుకుంది. శిక్షణలో ఉన్నప్పుడే ధైర్యసాహసాలున్న యువతిగా పేరు తెచ్చుకుంది. స్పైస్ జెట్ సంస్థలో 2018లో పైలట్‌గా చేరింది. ఇటీవల బోయింగ్ 737కు కెప్టెన్ ఇన్ కమాండ్‌గా బాధ్యతలు తీసుకుంది. ఆదివారం పట్నా నుంచి దిల్లీ బయలుదేరిన ఆ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగిన సంఘటనలో చురుగ్గా నిర్ణయం తీసుకొని అందరినీ రక్షించి వార్తల్లోకెక్కింది.
ఆ 18 నిమిషాలు.. పట్నా నుంచి బయలుదేరిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో విమానం రెక్కలూ, ఇంజిన్ దగ్గర మంటలు వచ్చాయి. ఇంజిన్- 1 నుంచి మంటలు వస్తున్నాయంటూ విమాన సిబ్బంది సమాచారమిచ్చారు. వెంటనే ఆ ఇంజిన్ని ఆఫ్ చేసింది. లేదంటే ఆ ప్రభావం మిగతా విమానభాగాలపై పడే ప్రమాదం ఉండేది. భయాందోళనలకు గురికావద్దని, ధైర్యంగా ఉండాలని సిబ్బందితో ప్రయాణికులకు చెప్పించింది. విమానాన్ని తిరిగి పట్నా విమానాశ్రయానికి చేర్చడమే మేలని తన ఆలోచనని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు చెప్పింది. ఏమాత్రం తొణకకుండా ఏకాగ్రతగా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌తో సమన్వయం చేసుకుంటూ తిరిగి సురక్షితంగా విమానాశ్రయంలో దించింది. ప్రయాణం మొదలుపెట్టి, తిరిగి ల్యాండ్ అయ్యేసరికి మొత్తం 18 నిమిషాలు పట్టింది. అందరూ ప్రాణాలు గుప్పెటపెట్టుకొని ఉండగా ఎంతో చాకచక్యంగా 185 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బందిని కాపాడింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా విమానం నేల కూలేదే. అలా జరగకుండా అందరినీ భద్రంగా చేర్చిన మోనికాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!