ల్యాబ్‌ వజ్రాలతో నగలు చేస్తున్నా

నగల వ్యాపారమంటే.. మనం చేసిన డిజైన్లను మెప్పించడమేనా? కొనేవాళ్లకు నచ్చినవి చేసివ్వడం ఎందుకు కాకూడదు! దీన్నే తన ప్రత్యేకతగా చేసుకుంది పాతికేళ్ల విశేషిని రెడ్డి. అంతేకాదు.. ఖరీదు, లోహంతో సంబంధం లేకుండా నగలన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చింది. ఎందరో డిజైనర్లు రూపొందించిన వాటికీ వేదిక కల్పిస్తోంది. సాంకేతిక సొబగులద్దుతోంది. అమ్మాయిలు అరుదుగా ఉండే ఈ రంగంలో తన ప్రయాణం ఎలా సాగుతోందో వసుంధరతో పంచుకుంది..!

Updated : 16 Jul 2022 07:15 IST

నగల వ్యాపారమంటే.. మనం చేసిన డిజైన్లను మెప్పించడమేనా? కొనేవాళ్లకు నచ్చినవి చేసివ్వడం ఎందుకు కాకూడదు! దీన్నే తన ప్రత్యేకతగా చేసుకుంది పాతికేళ్ల విశేషిని రెడ్డి. అంతేకాదు.. ఖరీదు, లోహంతో సంబంధం లేకుండా నగలన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చింది. ఎందరో డిజైనర్లు రూపొందించిన వాటికీ వేదిక కల్పిస్తోంది. సాంకేతిక సొబగులద్దుతోంది. అమ్మాయిలు అరుదుగా ఉండే ఈ రంగంలో తన ప్రయాణం ఎలా సాగుతోందో వసుంధరతో పంచుకుంది..!


మనం ఏది చేయాలన్నా కుటుంబం, డబ్బులు.. ఇలా ఎన్నో ఆలోచించి వెనకడుగేస్తాం. కానీ ఆ లోటు ఎప్పటికీ అలా ఉండిపోతుంది. రంగమేదైనా ప్యాషన్‌ని వదలొద్దు. జెమాలజీ ఖర్చుతో కూడుకున్నది. కోర్సు మొదటి సెమిస్టర్‌కి అమ్మా నాన్నా ఫీజు కట్టారు. వ్యాపారానికి పెట్టుబడీ వాళ్లే పెట్టారు. దీంతో రెండో సెమిస్టర్‌కి వాళ్ల నుంచి తీసుకోకూడదనుకున్నా. స్కాలర్‌షిప్‌ అవకాశముందని తెలిసి చాలా కష్టపడి దాన్ని సాధించా. వెతకాలే గానీ మన చుట్టూనే ఎన్నో అవకాశాలుంటాయి. అమ్మాయిలు ఈ కోణంలో ఆలోచిస్తే.. భవిష్యత్తులో బాధ పడకుండా ఉండొచ్చు. ఎన్నో సాధించొచ్చు.

నగల వ్యాపారమంటే.. మనం చేసిన డిజైన్లను మెప్పించడమేనా? కొనేవాళ్లకు నచ్చినవి చేసివ్వడం ఎందుకు కాకూడదు! దీన్నే తన ప్రత్యేకతగా చేసుకుంది పాతికేళ్ల విశేషిని రెడ్డి. అంతేకాదు.. ఖరీదు, లోహంతో సంబంధం లేకుండా నగలన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చింది. ఎందరో డిజైనర్లు రూపొందించిన వాటికీ వేదిక కల్పిస్తోంది. సాంకేతిక సొబగులద్దుతోంది. అమ్మాయిలు అరుదుగా ఉండే ఈ రంగంలో తన ప్రయాణం ఎలా సాగుతోందో వసుంధరతో పంచుకుంది..!

నిజానికి నా ఆసక్తి నగలపై కాదు.. రాళ్లు, రత్నాల మీద! చిన్నప్పటి నుంచీ సైన్స్‌ మీద ఉన్న ఆసక్తి వీటివైపు మళ్లింది. అమ్మ హరిత, నాన్న రవికాంత్‌ రెడ్డి.. ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారం చేసేవారు. హోటల్‌నీ నిర్వహిస్తున్నారు. వాళ్లని చూస్తూ పెరిగినా వ్యాపార ఆలోచన ఎప్పుడూ లేదు. అందుకే కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశా. ఉద్యోగంలోనూ చేరా. కానీ ఆ వాతావరణం సరి పడలేదు. అమ్మానాన్న మొదట్నుంచీ ‘నీకు నచ్చిన వ్యాపారం చేయొచ్చుకదా, మన కాళ్ల మీద మనం నిలబడ్డట్టు ఉంటుంది. కొందరికీ ఉపాధి కల్పించినట్టూ అవుతుంది’ అనే వారు. మా అన్నయ్యది బ్యాటరీ స్వాప్‌ స్టార్టప్‌. ఇక అప్పుడు ఆలోచించా. ఆభరణాల్లో వాడే రాళ్లు, రత్నాలపై చాలామందికి అవగాహన ఉండదు. ఆ విషయంలో సాయపడొచ్చని నగల వ్యాపారం చేయాలనుకున్నా.

జ్యువెల్లరీ మార్కెట్‌ని పరిశోధిస్తే.. ఎక్కడైనా బంగారాన్ని ప్రమోట్‌ చేసే వారే! ఇతర లోహాల నగలకు ప్రాధాన్యమే ఇవ్వట్లేదు. పైగా ఎక్కడైనా వాళ్లు రూపొందించి అమ్మే నగలే. కస్టమర్లకు కావాల్సిందేంటో చూసే వారేరి? వినియోగదారు మనసులో ఒక ఆలోచనుంటుంది, షాపులకి వెళ్లాకేమో అక్కడున్న వాటిల్లోనే ఎంపిక చేసుకోవాలి. ఒక్కోసారి బడ్జెట్టూ దాటొచ్చు. పోనీ వెండితో చేయించుకోవాలి అనుకున్నారు. వాటి కోసం మరో చోటికి వెళ్లాలి. ఇవన్నీ ఆలోచించా. ఇంకా.. నగ నచ్చి కొనేలా ఉండాలి తప్ప విలువ ఆధారంగా కాదన్నది నా ఆలోచన. అందుకే ధరతో సంబంధం లేకుండా వీలైనన్ని రకాల్ని అందుబాటులో ఉంచాలనుకున్నా. అప్పుడొచ్చిన ఆలోచనే ‘మల్టిపుల్‌ డిజైనర్‌ స్టోర్‌’. ముందు ముంబయిలోని జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా నుంచి కోర్సు పూర్తిచేశా. ఆపై 2019లో హైదరాబాద్‌లో ‘హవ్య జ్యువెల్స్‌’ ప్రారంభించా. బంగారం, డైమండ్‌, వెండి, ఫ్యాషన్‌, కంచు, స్టేట్‌మెంట్‌.. వంటి నగలన్నీ ఒకేచోట దొరికేలా తీర్చిదిద్దా. అంటే రూ.500 నుంచి రూ. 30 లక్షల ఖరీదు వరకూ ఒకేచోట లభిస్తాయన్న మాట. ఇందుకోసం దేశవ్యాప్తంగా డిజైనర్లను సంప్రదించా. జెమాలజీ చేసేటప్పుడు అయిన పరిచయాలు, పరిశోధన సాయపడ్డాయి. పాతిక మందికి పైగా డిజైనర్ల ఆభరణాలు మా దగ్గర దొరుకుతాయి. బంగారం విషయంలోనూ కస్టమర్ల ఆసక్తికే ప్రాధాన్యం. అపాయింట్‌మెంట్‌ తీసుకుని వాళ్ల బడ్జెట్‌, డిజైన్‌.. వంటి వన్నీ చర్చిస్తాం. తయారీ మాదే కాబట్టి, ఖర్చూ తగ్గుతుంది. మా దగ్గర పది మంది వరకూ పనిచేస్తున్నారు. కొన్ని డిజైన్లను వాటిలో నిపుణులైన ఇతర రాష్ట్రాల వారితో చేయిస్తుంటా. ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌కి ప్రాధాన్యమిస్తా. వజ్రం ఏర్పడటానికి అవసరమైన వాతావరణాన్ని ల్యాబ్‌లో సృష్టించి రూపొందిస్తామన్న మాట. ఇవి ధర తక్కువ. పైగా పర్యావరణ హితం. వీటి కోసం ‘లైమ్‌ లైట్‌’ సంస్థతో టైఅప్‌ అయ్యాం. మా నగలను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెచ్చా. పాజిటివ్‌ రివ్యూలొచ్చేవి. దీంతో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచీ కస్టమర్లొస్తున్నారు. హీరోయిన్లు అవికా గోర్‌, ప్రగ్యా జైస్వాల్‌, మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి వంటి వాళ్లు మా ఖాతాదారులే. స్టైలిస్ట్‌లూ సంప్రదిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిని కదా! మాకో ప్రత్యేకత ఉండాలని... ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీని జోడిస్తున్నా. దాంతో నచ్చిన నగ పెట్టుకుంటే మనకెంత వరకూ నప్పుతుందో ఇంట్లో కూర్చొనే చూసుకోవచ్చు.

భయపడలేదు...

లాక్‌డౌన్‌ సమయంలో డిజైనర్లు, తయారీదారులకు నమ్మకం కలిగించడం, పట్టి ఉంచడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి..అయినా భయపడలేదు. ఇంకా గట్టిగా ప్రయత్నించాలనే కసి పెరిగింది. వ్యాపారాన్నీ మనిషిలానే చూస్తా. రెండేళ్లు జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాక మరింత అనుబంధం పెరిగింది. నచ్చినట్టుగా చేసిచ్చినప్పుడు కస్టమర్ల కళ్లలో కనిపించే ఆనందం, సంతృప్తి ఇంకా ప్రయత్నించాలన్న ప్రేరణనిస్తాయి. వీలు దొరికినప్పుడల్లా నాన్నకీ హోటల్‌ పరంగా అకౌంట్స్‌, ఆపరేషన్స్‌ అంశాల్లో సాయపడుతుంటా.

- శ్రీపతి శ్రీనివాస్‌, ఈటీవీ, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్