ఒత్తిడి.. తరిమేస్తామిలా!
కాలంతో పరుగులు, ఇంటి బడ్జెట్- పనులు, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలు.. వీటితోనే తీవ్ర ఒత్తిడికి గురవుతుంటాం. దాన్నుంచి తప్పించుకోవడానికి ఓ పాటనో, సినిమానో ఆశ్రయిస్తుంటాం. మరి వాటిలో నటించే వాళ్ల సంగతేంటి? తెలియని భాషల్లో నటించడం, అందం, ఫ్యాషన్లు, మాట్లాడే మాట, తరచూ పర్యటనలు, వృత్తిపరమైన పోటీ, ప్రతినిమిషం డేగకళ్లతో పరీక్షించే కెమెరాలు..
కాలంతో పరుగులు, ఇంటి బడ్జెట్- పనులు, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలు.. వీటితోనే తీవ్ర ఒత్తిడికి గురవుతుంటాం. దాన్నుంచి తప్పించుకోవడానికి ఓ పాటనో, సినిమానో ఆశ్రయిస్తుంటాం. మరి వాటిలో నటించే వాళ్ల సంగతేంటి? తెలియని భాషల్లో నటించడం, అందం, ఫ్యాషన్లు, మాట్లాడే మాట, తరచూ పర్యటనలు, వృత్తిపరమైన పోటీ, ప్రతినిమిషం డేగకళ్లతో పరీక్షించే కెమెరాలు... ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. వీటితో ఇంకెంత ఒత్తిడి... మరి.. వాళ్లు దాన్నెలా తరిమేస్తున్నారు? చదివేయండి.
నవ్వే మంత్రం: రష్మిక మందన్న
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది రష్మిక. పలు భాషల్లో పనిచేసే అవకాశంతోపాటు భాషా దోషాలు, తన రూపం, దుస్తులపై వచ్చే కామెంట్లు, ట్రోలింగ్ అన్నీ ఒత్తిడిని నింపేవేనట. ‘‘ప్రపంచానికి నీ బలహీనతల్ని ఎప్పటికీ చూపించకు’.. చిన్నతనం నుంచీ అమ్మ చెప్పిన మాట ఇది. అందుకే పరిస్థితితో సంబంధం లేకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా. సెట్లో అడుగుపెట్టడంతో ఒత్తిడి మొదలు. స్క్రిప్ట్, గుర్తుంచుకోవాల్సిన డైలాగులు.. దానికి తగ్గ హావభావాలను గమనించుకుంటూనే దర్శకుడిని ఒప్పించాలి మరి! దీనికితోడు రూపురేఖలు, మాటతీరు, వస్త్రాలు అన్నింటిపైనా ట్రోలింగ్. భరించలేని కామెంట్లు. మొదట్లో ఇంట్లో వాళ్లకి, స్నేహితులకీ చెప్పి వాళ్లని ఆందోళన పెట్టకూడదని నేనే భరించేదాన్ని. ఏడుస్తూ నిద్రపోయిన రాత్రులెన్నో. ఇంతమంది చెబుతున్నారంటే నన్ను నేను మార్చుకోవాలేమో అనుకొని ప్రయత్నించా. అయినా ఆ వ్యాఖ్యలు ఆగలేదు. దీంతో నవ్వి ఊరుకోవడం మొదలుపెట్టా. ఇప్పుడు ఏదైనా విషయం ఇబ్బంది కలిగిస్తోందా.. జిమ్‌కెళ్లి అలసిపోయేలా వర్కవుట్లు చేస్తా. పెద్ద సౌండ్‌తో పాటలు వింటా, విపరీతంగా డ్యాన్స్ చేస్తా. వ్యాయామం ఎలాగూ చేస్తా కాబట్టి, నచ్చినంత ఐస్‌క్రీమ్ తినేస్తా. కొరియన్ సినిమాలూ, బీటీఎస్ వీడియోలూ ఇప్పుడు ఆ జాబితాలోకి వచ్చేశాయి’ అంటోందీ కన్నడ అమ్మాయి.
నన్ను బయటపడేసేవి అవే: సాయి పల్లవి
అందంలోనే కాదు నటనలోనూ సహజత్వానికి ప్రాధాన్యమిచ్చే సాయి పల్లవి.. ఒత్తిడిని జయించడంలోనూ తనది అదే మార్గమంటోంది. ‘కుటుంబమే నా లోకం. వాళ్ల నుంచి ఏ మాత్రం దూరంగా వచ్చినా ఆందోళన పడుతుంటా. పోలిక నాకు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేదాన్ని. కానీ అభిమానులను దగ్గర చేసే మాధ్యమమదే. కాబట్టి, అప్పుడప్పుడూ నా పని, సొంత విషయాలను పంచుకుంటుంటా. సినిమా, చదువు.. ఇలా ఏదో ఒక విషయంలో బిజీగా ఉన్నంతసేపూ చుట్టూ లోకాన్నే మర్చిపోతా. ఒకసారి ఆ వాతావరణం నుంచి బయట పడ్డానంటే ఏదో ఏదో ఆలోచిస్తుంటా. దీంతో తెలియని ఒత్తిడి, ఆందోళన. నా చేతికెప్పుడూ ఓ జపమాల ఉంటుంది. అది మా తాతగారు ఇచ్చారు. అది నన్ను శాంతపరిచే సాధనం. దాన్ని రోజూ ధరిస్తా. దాంతో రోజూ 108సార్లు జపం, ధ్యానం చేస్తా. అప్పుడు నా ఆలోచనలు, భావోద్వేగాలు అదుపులోకి వచ్చేస్తాయి. ఇంట్లో ఉంటే మా చెల్లే నా స్ట్రెస్ బస్టర్. డ్యాన్స్ కూడా చేస్తా. అదే నా మనసు, శరీరం రెంటినీ ఫిట్‌గా ఉంచుతుంది’ అంటోంది.
ఆమెతో గడిపితే చాలు: పూజా హెగ్దే
జయాపజయాలతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది పూజా. వదంతులు తనపై ఏమాత్రం ప్రభావం చూపవనే ఈమె... ఒత్తిడిని ఎలా దూరంగా ఉంచుతుందంటే.. ‘భిన్న సమయాలు, భాషలు, వ్యక్తులు, వాతావరణాల్లో పని.. ఒత్తిడి సహజమేగా! అయితే జయపజయాలను పట్టించుకోను. నేనెంత వరకూ కష్టపడ్డానన్నదే చూసుకుంటా. రోజూ యోగా, వ్యాయామం తప్పక చేస్తా. ఇవి శరీరాన్నీ, మనసునీ ఆరోగ్యంగా ఉంచుతాయి. మనసు బాగాలేకపోయినా ఆందోళన కలిగినా మా బామ్మ ముందు వాలిపోతా. నా చిన్న నాటి సంగతులు, చిలిపి విషయాలు.. ఎన్నో మాటల్లో దొర్లుతాయి. నచ్చిన నవలను మళ్లీ మళ్లీ చదువుతున్న భావన. దీంతో సమయమే తెలియదు. పైగా మానసికానందం’.
నైక్ ఉందిగా.. : కీర్తి సురేశ్
హీరోయిన్గా కంటే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్. నచ్చితే ఏ పాత్రనైనా చేయడానికి ముందుకొచ్చే ఈమె తనను ఒత్తిడికి దూరంగా ఉంచేదేంటో చెప్పుకొచ్చిందిలా.. ‘ప్రతి పాత్రని బాగా చేయాలంటే ఒత్తిడి అనివార్యం. మహానటి తర్వాత అది మరింత పెరిగింది. ఏమాత్రం ఆందోళనగా అనిపించినా నా పెంపుడు కుక్క నైక్‌తో ఆడతా. దాన్ని హత్తుకుంటే ఆందోళనంతా హుష్‌మని ఎగిరిపోతుంది. లేదూ దూరప్రయాణాలు చేస్తా. దేశం, విదేశంతో సంబంధం లేదు.. నచ్చిన చోటుకు ప్రయాణం కట్టేస్తా’ అని చెబుతోందీ మలయాళీ అమ్మాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?