జనగణమన ఖ్యాతి ఖండాంతరాలకు
జాతీయ గీతం.. పాడినా, విన్నా దేశభక్తి ఉప్పొంగుతుంది. అలాంటి దీన్ని ఏకధాటిగా ఏడు గంటలపాటు ఆలపించింది అర్చన. జనగణమనకు ప్రపంచ ఖ్యాతి దక్కేలా చేయడమే తన ఉద్దేశమంటోంది. ఇంతకీ ఆమెవరో చదివేయండి.
జాతీయ గీతం.. పాడినా, విన్నా దేశభక్తి ఉప్పొంగుతుంది. అలాంటి దీన్ని ఏకధాటిగా ఏడు గంటలపాటు ఆలపించింది అర్చన. జనగణమనకు ప్రపంచ ఖ్యాతి దక్కేలా చేయడమే తన ఉద్దేశమంటోంది. ఇంతకీ ఆమెవరో చదివేయండి.
అర్చన పండుగది కరీంనగర్. ప్రైవేటు పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్. చిన్నప్పట్నుంచీ జాతీయగీతాన్ని ఆలపించడమంటే చాలా ఇష్టం. లయబద్ధంగా పాడుతోంటే టీచర్లూ పొగిడే వారు. అలా దానిపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే దాని గురించి తెలుసుకుంటే.. మొత్తం అయిదు చరణాలున్నాయని తెలిసింది. మనం పాడేదేమో ఒక్క చరణమే! చాలామందికి ఈ విషయం తెలియకపోవడమూ గమనించింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంది. ఇప్పటికీ ఎక్కడ జాతీయ గీతం ఆలపించే అవకాశమొచ్చినా వదులు కోదు. తన దేశభక్తిని చాటే సాధనంగా భావిస్తుంది. విదేశీ సందర్శన, అక్కడి సంప్రదాయాలను తెలుసుకోవడమంటే ఆసక్తి. కొన్ని దేశాలు వారి జాతీయ గీతానికిచ్చే గౌరవం ఆశ్చర్యపరిచింది. ఆలాపన సమయంలో వాళ్లు కఠిన నియమాలు పాటిస్తారు. మన దగ్గర కొందరిలో అది కొరవడటం బాధనిపించేది. అందుకే తన విద్యార్థుల్లో వీటిపై అవగాహన కల్పిస్తుంది.
తనకు ఎప్పట్నుంచో జాతీయగీతాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే కోరిక. ఈ దేశాల్ని చూశాక మరింత ఎక్కువైంది. అందుకు గిన్నిస్ బుక్ రికార్డు మార్గమని నిబంధనలు తెలుసుకుంది. ఐదు చరణాలనూ కలిపి 5.20 నిమిషాల్లో పూర్తి చేయాలి. 75సార్లు పాడటానికి ఏడు గంటలు. లాక్డౌన్లో కావాల్సినంత సమయమూ దొరికింది. శ్వాసపై దృష్టిపెడుతూ సాధన చేసింది. ఆ సమయంలో కరోనా బారిన పడ్డా, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురైనా.. కొనసాగించింది. లండన్‌లోని సంస్థకు 40 వినతులు పంపాక అంగీకరించారు. అయితే తన సొంత జిల్లాలోనే కార్యక్రమం నిర్వహించాలని కోరింది. ఈ శనివారం (జులై 16) కరీంనగర్లో ఆజాద్‌కీ అమృత్ మహోత్సవాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గం వరకు ఏకబిగిన 7గం.లపాటు జాతీయ గీతాన్ని ఆలపించింది.
‘నా కల నేటికి నెరవేరింది. పిల్లల్లో విద్యార్థి దశ నుంచే దేశ భక్తి భావాలను పెంపొందించాలి. యువతలో మన దేశ చరిత్రపై అవగాహన కల్పించాలి. ఇది వేలమంది వీరుల పోరాట ఫలం. ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు పాఠ్యాంశాలకే పరిమితమవొద్దన్నది నా ఆశ. భవిష్యత్‌లోనూ ఆ దిశగా కార్యక్రమాలు చేస్తా’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!