స్వయంకృషితో వేల కోట్లు సంపాదించింది...

‘‘లోకం చాలా చిత్రమైంది. అనవసరమైన వాటిని అత్యంత ప్రాధాన్యమున్నవిగా భావించేలా చేయగలదు. దీంతో అసలు జీవితమంటే ఏమిటో, జీవించడమెలాగో తెలియకుండానే పోతాం. అందుకే నా సంపాదన నా కోసం మాత్రమే కాదు.

Updated : 21 Jul 2022 08:47 IST

‘‘లోకం చాలా చిత్రమైంది. అనవసరమైన వాటిని అత్యంత ప్రాధాన్యమున్నవిగా భావించేలా చేయగలదు. దీంతో అసలు జీవితమంటే ఏమిటో, జీవించడమెలాగో తెలియకుండానే పోతాం. అందుకే నా సంపాదన నా కోసం మాత్రమే కాదు. ఇతరులకు సాయం చేయడానికి కూడా. నా ఆలోచన ఎప్పుడూ దీని చుట్టూనే తిరుగుతుంటుంది’’.

సాధారణ స్థాయి నుంచి రిహన్నా గాయనిగా కెరియర్‌ ప్రారంభించి, తొమ్మిది గ్రామీ అవార్డులు అందుకుంది. అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న ఈమె, వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టి, తానేంటో నిరూపించుకుంది. తాజాగా అమెరికా ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ సెల్ఫ్‌ మేడ్‌ బిలియనీర్‌’గా 34 ఏళ్ల రిహన్నా నిలిచింది. ఈమె నికరాస్తి ఎంతో తెలుసా? రూ.11 వేల కోట్లు (1.4 బిలియన్ల డాలర్లు).

కాస్మొటిక్స్‌ కంపెనీలు ‘ఫెంటీ బ్యూటీ’, ‘ఫెంటీ స్కిన్‌’, అలాగే లోదుస్తుల తయారీ సంస్థ ‘సేవేజ్‌ ఎక్స్‌ ఫెంటీ లింగెరీ’కి సీఈవో, సహవ్యవస్థాపకురాలు రిహన్నా. సొంతూరైన బార్బడాస్‌ నుంచీ ఈమే తొలి బిలియనీర్‌. ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చిన తనకు సేవాగుణం కూడా ఎక్కువే. తన సంపాదనలో కొంత సామాజిక సేవకు వినియోగిస్తుంది. పేద పిల్లలను చదివించడానికి, మహిళలకు ఉచిత వైద్యం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటికి నిధులను అందించడానికి 2012లో రిహన్నా ‘క్లారా లయనెల్‌ ఫౌండేషన్‌’ స్థాపించింది. దీన్ని ప్రారంభించిన ఏడాదికే హెచ్‌ఐవీ బాధిత చిన్నారులు, మహిళలకు చేయూతగా రూ.479 కోట్లు విరాళంగా అందించిందీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్