ఆవు పేడతో.. రంగులు!
మట్టి ఇళ్లకు గచ్చులా మారే ఆవుపేడలో సూక్ష్మజీవులను దరిచేరనివ్వని గుణాలున్నాయని తెలుసుకుంది. దాంతో రంగుల తయారీ మొదలుపెట్టింది దుర్గా ప్రియదర్శిని. సహజ సిద్ధమైన వాటితో ఇకో-ఫ్రెండ్లీగా రూపొందిస్తున్న ఈ పెయింట్ తయారీపై అందరికీ అవగాహన కల్పిస్తోంది..
మట్టి ఇళ్లకు గచ్చులా మారే ఆవుపేడలో సూక్ష్మజీవులను దరిచేరనివ్వని గుణాలున్నాయని తెలుసుకుంది. దాంతో రంగుల తయారీ మొదలుపెట్టింది దుర్గా ప్రియదర్శిని. సహజ సిద్ధమైన వాటితో ఇకో-ఫ్రెండ్లీగా రూపొందిస్తున్న ఈ పెయింట్ తయారీపై అందరికీ అవగాహన కల్పిస్తోంది..
గృహిణిగా ఉండే దుర్గ చిరువ్యాపారిగా మారాలనుకుంది. తనకాళ్లపై తాను నిలబడుతూనే మరికొందరికి ఉపాధి అందించాలనుకునేది. ఒడిశాకు చెందిన ఈమె మొదట ఆవుపాల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని అనుకుంది. హరియాణా, పంజాబ్ వంటి ప్రాంతాల్లో పశుసంపద ఎక్కువని తెలుసుకొని అక్కడికెళ్లి పశు సంరక్షణ శిక్షణలో చేరింది. జార్ గ్రామంలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆవు పేడ నుంచి పెయింట్ తయారుచేయొచ్చని తెలుసుకుంది. పశుసంరక్షణ కన్నా ఈ పెయింట్ తయారీ నచ్చిందీమెకు. దాంతో అక్కడి నుంచి జయపురకు వెళ్లి అక్కడ పేడతో పెయింట్ తయారీ నేర్చుకోవడానికి ప్రభుత్వం అందించే శిక్షణలో చేరింది.
800 రకాలు..
సొంతూరు ఒడిశాకు చేరుకున్న దుర్గ ‘గ్రీన్ ఫీల్ పెయింట్స్’ పేరుతో 2021లో పేడ నుంచి పెయింట్ తయారీ మొదలుపెట్టింది. శిక్షణ తీసుకోవడం వేరు. దాన్ని ప్రయోగాత్మకంగా కార్యాచరణలో పెట్టడం వేరు. ఈ క్రమంలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి దుర్గకు. ‘ప్రభుత్వ సహకారంతో బార్‌ఘర్ సమీపంలోని ఓ గ్రామంలో 2,500 చదరపుటడుగుల చోటులో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశా. స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థుల నుంచి పేడను కేజీ రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. దాన్నుంచి మెషిన్ల ద్వారా మాకు కావాల్సిన ద్రవపదార్థాన్ని వేరు చేస్తాం. కాల్షియం కలిపి ప్రత్యేక విధానాలతో పెయింట్ తయారుచేస్తాం. ఈ పెయింట్‌లో 30 శాతం పేడ ఉంటుంది. ఆ తర్వాత దీనికి కావాల్సిన రంగులను కలుపుతాం. రంగుల తయారీ కూడా సహజసిద్ధంగానే ఉంటుంది. ఈ రంగులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉంటాయి. దీన్ని ఇంటా, బయట కూడా వినియోగించొచ్చు. ఎటువంటి వాతావరణానికీ పాడవ్వదు. సాధారణ పెయింట్ ఇచ్చే లుక్ దీంతోనూ వస్తుంది. ప్రస్తుతం రంగులన్నింటిలో 800 రకాల షేడ్స్ తయారుచేస్తున్నాం’ అని చెబుతోంది దుర్గ.
మార్కెటింగ్‌లో..
ఒడిశాలో ఇలా పేడతో పెయింట్ తయారుచేయడం తొలిసారి కావడంతో దీనిపై చాలామందికి అవగాహన లేదు. అందరిలోనూ దీనిపై అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు మార్కెటింగ్ కూడా చేస్తోంది దుర్గ. ఒడిశాసహా ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రస్తుతం ఆర్డర్లు వస్తుండగా దేశవ్యాప్తంగా దీని గురించి తెలియజేయాలనుకుంటోందీమె. అందుకే రాష్ట్రేతర ప్రాంతాల్లో జరిగే సెమినార్లకు హాజరై, ఈ రంగుల గురించి చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పర్యటించి వీటి గురించి వివరిస్తోంది. త్వరలో ‘గ్రీన్ ఫీల్ పెయింట్స్’ నుంచి ‘నేచురల్ వాల్ పుట్టి’ లభ్యం కానుంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఈ పెయింట్లు విక్రయిస్తుండగా, ఈ ఏడాదిలోపు ప్రతి హార్డ్‌వేర్ దుకాణంలోనూ వినియోగదారుడికి వీటిని లభ్యమయ్యేలా చూస్తానంటోంది దుర్గ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!