లేసు ఉత్పత్తులకి గుర్తింపు తెచ్చింది!
గ్రామీణ ప్రాంతాల్లో లేసులతో వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేసే మహిళల హస్తకళా నైపుణ్యాన్ని గుర్తించిందీమె. ఆర్థికంగా వారెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి ఆ కళను ప్రపంచానికి పరిచయం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో లేసులతో వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేసే మహిళల హస్తకళా నైపుణ్యాన్ని గుర్తించిందీమె. ఆర్థికంగా వారెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించి ఆ కళను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కృషికే హైదరాబాద్‌కు చెందిన అన్వీషారెడ్డి డయానా అవార్డుకు ఎంపికయ్యింది...
అన్వీషా ఓసారి తన సొంతూరికి వెళ్లినప్పుడు అక్కడ చాలామంది మహిళలు రంగురంగుల లేసులతో పలురకాల ఉత్పత్తులను అల్లడం చూసింది. మార్కెట్లో వాటిని ఎప్పుడూ చూడలేదు తను. వీటిని అమ్మొచ్చుగా? అని వాళ్లని అడిగింది. తాము తయారుచేస్తున్న ఉత్పత్తులను ఎలా విక్రయించాలో తెలియదని చెప్పడంతో వాళ్లకి మార్కెటింగ్‌పై అవగాహన లేదని అన్వీషా తెలుసుకుంది. వారికి చేయూతనందించడం కోసం.. ‘ఇంక్రెడిబుల్ ఆర్ట్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో ఆ ఉత్పత్తుల వివరాలను, ఫొటోలను పొందుపరచడం మొదలుపెట్టింది. ఊలుతో వాళ్లు రూపొందిస్తున్న పర్సులు, బ్యాగులు, టాప్స్, కుషన్ కవర్ల వివరాలను ఆన్లైన్లో వారంతటవారే పొందుపరుచుకొనేలా చేసింది. మార్కెట్లోకి తమ ఉత్పత్తులను ఎలా తీసుకెళ్లాలో శిక్షణనిచ్చింది. మధ్యవర్తుల్లేకుండానే ప్రతి మహిళకూ.. వ్యక్తిగతంగా ఎదగడానికి కావాల్సిన సాంకేతికత పరిజ్ఞానాన్ని నేర్పింది. ‘ఇక్కడి మహిళలందరికీ హస్తకళలో నైపుణ్యం ఉంది. వారికి చేయూతనందిస్తే ఆర్థికంగా ఆ కుటుంబాలన్నీ నిలబడతాయనిపించింది. ఆధునిక డిజైన్లపట్ల అవగాహన కలిగించి వాటిని రూపొందించేలా చేయడంతోపాటు, వెబ్సైట్ ద్వారా వాటిని బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నా. ఈ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి వినియోగదారులను సంప్రదించే విధానాన్నీ నేర్పించా. ప్రతి దుకాణానికి వెళ్లి వీటి గురించి మార్కెటింగ్ చేయడం, చిన్నచిన్న ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు ఉంచడం వంటివి ఈ ఉత్పత్తుల గురించి అందరికీ తెలిసేలా చేశాయి. ఆన్లైన్లో ఆర్డర్లు వచ్చినప్పుడు వాటిని వినియోగదారులకు ఎలా అందించాలో వీళ్లంతా నేర్చుకున్నారు. త్వరలో ప్రపంచమంతా ఈ ఉత్పత్తులని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం ఇక్కడి మహిళలందరూ తమకు తెలిసిన ఈ కళతో ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు అదే పెద్ద సంతోషం. అంతకుమించి ఈ ఏడాది డయానా అవార్డు రావడం ఇంకా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది 16 ఏళ్ల అన్వీషా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!