పరిష్కారంలో భాగమవుదాం రండి!
సమాజంలో మార్పు తేవడానికి అనుభవం, వయసు కీలకమనుకోవడం పొరపాటని ఈ అమ్మాయి గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. సమస్యల పరిష్కారానికి కొత్త దారిని చూపిస్తోంది టీనేజర్ ఆషీ చందన.
సమాజంలో మార్పు తేవడానికి అనుభవం, వయసు కీలకమనుకోవడం పొరపాటని ఈ అమ్మాయి గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. సమస్యల పరిష్కారానికి కొత్త దారిని చూపిస్తోంది టీనేజర్ ఆషీ చందన.
రెండేళ్ల కిందట... కరోనా కారణంగా ప్రపంచం తలకిందులైన పరిస్థితి. ప్రజల వెతల్ని టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తూ అయ్యో పాపం అనుకోని వాళ్లుండరు. ఆ అమ్మాయి కూడా అలానే అనుకుంది. అంతేకాదు, ‘చూసి బాధపడటమేనా, సమస్యలకు పరిష్కారం చూపలేమా’ అనీ మధనపడింది. కొత్త ఆలోచనతో ‘ప్రాజెక్ట్ ఇన్వాల్వ్’ ప్రారంభించింది.
అమెరికాలోని న్యూజెర్సీలో హైస్కూల్ విద్యార్థి ఆషి. విద్య, వైద్యం అందకపోవడం, ప్రకృతి వైపరీత్యాలూ, పర్యావరణం, రాజకీయ ఉద్యమాలు... ఇలాంటి వాటి గురించి సోషల్ మీడియాలో పోస్టులు చదువుతున్నప్పుడు సాయపడలేని నిస్సహాయత తనది. వారికోసం ఏమైనా చేయాలనుకుంది. అప్పుడే ఆమెకో ఆలోచన వచ్చింది. ఆ పోస్టుల దగ్గర ‘సాయం చేయండి’ అన్న వెసులుబాటు ఉండేలా చేయాలనుకుంది. అందుకోసం ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ యాప్‌ని తెచ్చింది. దీన్లో పలు దేశాల సమస్యలూ, కష్టాల్లో ఉన్న వ్యక్తుల కథనాలు ఉంటాయి. వాటిని చదివాక ఎవరైనా ఆర్థికంగా, మరో రకంగా సాయం చేయాలనుకుంటే పక్కనే ఉన్న ‘హెల్ప్ నౌ’ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అందుకు సంబంధించిన ఓ ఎన్జీవో సమాచారం వస్తుంది. ఇండియా, అమెరికా, కెనడా, జర్మనీ, ఇటలీ, గ్రీస్, జపాన్, దక్షిణాఫ్రికా.. ఇలా దాదాపు 60 దేశాల ఎన్జీవోలు ఇప్పుడు ఆషీతో కలసి పని చేస్తున్నాయి. ఈ యాప్‌కి వేల మంది భాగస్వాములు, స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు. వారు గుర్తించిన సమస్యల్ని ‘ప్రాజెక్ట్ ఇన్వాల్వ్’ యాప్‌లో పెడతారు. నిత్యం వందల సంఖ్యలో వార్తల్ని దీన్లో చదవొచ్చు. బాధితులకు చేయూతనీ ఇవ్వచ్చు. అమెరికాకి రాకముందు ఆషీ కుటుంబం జపాన్‌లో ఉండేది. అక్కడ సునామీ వచ్చినపుడు అమ్మానాన్నలతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంది ఆషీ.
‘సమస్యని తెలుసుకోవడంతోపాటు పరిష్కారంలోనూ భాగం కావడం నాకు తృప్తినిస్తుంది. నాదే కాదు, నేటితరంలో చాలామంది భావన ఇది. ఎవరో వచ్చే వరకూ ఆగకుండా తామే పరిష్కరించాలనుకుంటారు. అందుకే ఇది మొదలుపెట్టా. ఈ యాప్ వినియోగదారుల్లో ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులే. ఈ విషయంలో ఎన్జీవోల్ని ఒప్పించడం పెద్ద సవాలు. కానీ అదీ ఓ అనుభవ పాఠమే’ అనే ఆషీ.. ఈ యాప్ ద్వారా వేల మందికి సాయపడింది. ఈమెని చూస్తుంటే యువతరం సేవలోనూ ఒకడుగు ముందే ఉందనిపిస్తోంది కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!