బ్రేకప్ అయ్యిందా..
ప్రేమికులు లేదా దంపతుల అభిప్రాయాల్లో తేడా వచ్చినప్పుడు అయ్యే బ్రేకప్ ఆ ఇద్దరి మనసులను కుంగదీస్తుంది. దీన్నుంచి బయటపడి తిరిగి జీవితాన్ని ఎలా ప్రారంభించాలో చెబుతున్నారు మానసిక నిపుణులు. బంధంలో ఉన్నప్పుడు ఎదుటివారి కోసం తమను తాము మార్చుకుంటూ, సర్దుకుంటూ వెళుతుంటారు. బ్రేకప్ అయినప్పుడు తమ కోసం తాము తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాలి.
ప్రేమికులు లేదా దంపతుల అభిప్రాయాల్లో తేడా వచ్చినప్పుడు అయ్యే బ్రేకప్ ఆ ఇద్దరి మనసులను కుంగదీస్తుంది. దీన్నుంచి బయటపడి తిరిగి జీవితాన్ని ఎలా ప్రారంభించాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.
వ్యక్తిగతంగా..
బంధంలో ఉన్నప్పుడు ఎదుటివారి కోసం తమను తాము మార్చుకుంటూ, సర్దుకుంటూ వెళుతుంటారు. బ్రేకప్ అయినప్పుడు తమ కోసం తాము తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాలి. వ్యక్తిగత పనులకు ప్రాముఖ్యతనిచ్చుకోవాలి. మనసులో కలిగే ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి సొంతంగా తమకుతాము సాయం చేసుకోవాలి. ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. విడిపోయిన వ్యక్తితో అన్నిరకాల బంధాలను దూరంగా ఉంచాలి. వారిని సోషల్‌మీడియాలోనూ అన్‌ఫాలో అవ్వాలి.
ఇతరులతో..
ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులు, స్నేహితులు, పెద్దవాళ్ల చేయూత తీసుకోవాలి. అలాకాకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడితే క్రమేపీ కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మనసులో ఆందోళనను స్నేహితులు లేదా శ్రేయోభిలాషులతో పంచుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. వారందించే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తే విడిపోయిన భావన నుంచి బయటపడొచ్చు.
ఆరోగ్యం..
పోషకవిలువలున్న ఆహారం, కంటి నిండా నిద్ర వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎంతటి సమస్యనైనా తట్టుకోగలిగి, ఆలోచించగలిగే సామర్థ్యాన్ని మెదడుకిస్తాయి. మానసికారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మనసుకు నచ్చిన చిత్రలేఖనం, పుస్తకపఠనం, నృత్యం, పుస్తకరచన వంటి అభిరుచులను బయటికి తీయాలి. ఏది సంతోషాన్నిస్తుందో గుర్తించి అందులో నైపుణ్యాలను పెంచుకోవాలి. దీంతో ఒంటరిననే భావం నుంచి బయటపడొచ్చు.
నిపుణులతో..
మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోతే నిపుణులను ఆశ్రయించడం మంచిది. వారి సలహాలు, సూచనలను పాటిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. మనసుకు నచ్చని బంధాన్ని కష్టంగా కొనసాగించడం కన్నా, దూరంగా ఉండటమే మంచిదనే ఆలోచన మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. తీసుకున్న నిర్ణయం సరైనదనే నమ్మకం మీపై మీకు ముందుగా రావాలి. అప్పుడే జీవితంలో మరో అడుగు ధైర్యంగా ముందుకు వేయగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!