సాయం.. మూడు వ్యాపారాలైంది!
‘చేయొద్దు’ అన్నదాని వైపే మనసు మళ్లుతుంటుంది. దివ్యా శెట్టికీ అంతే! అయితే ఆమె కుతూహలం వేలమంది రైతులకు సాయమందిస్తోంది. పర్యావరణ కాలుష్యం నుంచి కాపాడుతోంది. అంతేనా ఎంతోమందికి ఉపాధినీ కల్పిస్తోంది. ఇంతకీ భర్తతో కలిసి తను ఇవన్నీ ఎలా చేస్తోందో చదివేయండి.
‘చేయొద్దు’ అన్నదాని వైపే మనసు మళ్లుతుంటుంది. దివ్యా శెట్టికీ అంతే! అయితే ఆమె కుతూహలం వేలమంది రైతులకు సాయమందిస్తోంది. పర్యావరణ కాలుష్యం నుంచి కాపాడుతోంది. అంతేనా ఎంతోమందికి ఉపాధినీ కల్పిస్తోంది. ఇంతకీ భర్తతో కలిసి తను ఇవన్నీ ఎలా చేస్తోందో చదివేయండి.
దివ్యా వాళ్లది రైతు కుటుంబం. తన రెండో తరగతిలో తాత చనిపోయారు. ఆయనకు గొంతు క్యాన్సర్. చికిత్స ఖర్చు, వ్యవసాయంలో మిగిలిన అప్పు.. కుటుంబానికి మరింత భారం కావొద్దని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లది కర్ణాటకలోని ఉడిపి. ఈ సంఘటనతో ఇంట్లో వాళ్లెవరూ సాగు జోలికి వెళ్లొద్దని నిర్ణయించారు ఆమె అమ్మానాన్న. ఈమెను ఇంజినీరింగ్ చదివించారు. ఐటీలో పెద్ద ఉద్యోగం. అయితే రైతుల ఆత్మహత్య గురించి చదివిన ప్రతిసారి ఆమె మనసు తాతను గుర్తుచేసేది. వాళ్లు ఆ దిశగా ఎందుకు వెళుతున్నారో తెలుసుకోవాలనుకునేది. ఓసారి ఈ అంశంపై చర్చ జరుగుతోన్న చోటికి వెళ్లింది. అక్కడ తనకు విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు. వాళ్లది చెన్నై. ఓ అమెరికన్ సంస్థలో ఉద్యోగి. తనకీ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగించేవి. వీళ్లిద్దరూ కలిసి వీళ్లకి సాయం చేయాలనుకున్నారు. కారణాలు వెదుకుతోంటే.. నీటికొరత, మధ్యవర్తులు రైతుల ప్రధాన సమస్యలని అర్థమైంది. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి 2015లో ‘ఇండియన్ సూపర్ హీరోస్’ ప్రారంభించారు. దీని ద్వారా 800 మందికిపైగా రైతుల ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరేలా చేస్తున్నారు. ఎన్జీఓలతో కలిసి తక్కువ నీటితో వ్యవసాయం చేసే మెలకువల్నీ నేర్పిస్తున్నారు.
ఒకదాని నుంచి ఇంకోటి..
వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేప్పుడు టన్నులకొద్దీ పేపర్ వృథా అవడం గమనించారు. దీన్ని అడ్డుకోవడం కోసం ఏదైనా చేయాలనుకొని 2018లో ‘ప్లాంట్సిల్’ పేరుతో రీసైకిల్డ్ పేపర్ పెన్సిల్స్ తయారీ మొదలుపెట్టారు. వీటిలో విత్తనాలుంచే వారు. పెన్సిలంతా వాడేసి చివరి భాగం పడేసినా మొక్కలు వస్తాయన్నది వీళ్ల ఆలోచన. తర్వాత ‘పెపా’ పేరుతో ఇతర స్టేషనరీ, గిఫ్ట్‌లను రూపొందించి అమ్ముతున్నారు. రూ.వెయ్యితో ప్రారంభించిన దీని టర్నోవరు ఇప్పుడు ఏటా రూ.2 కోట్లకు చేరింది. వీళ్ల ప్రయత్నాన్ని గమనించిన కొన్ని సంస్థలు తమ వద్దనున్న ప్లాస్టిక్, మెటల్, ఇతర వ్యర్థాలకూ పరిష్కారం చూపమనే కోరేవి. వీళ్లు వాటిని సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్లకు పంపేవారు. తిరిగి వస్తువులుగా రూపొందించి ఇచ్చేవారు. ఇలా చేస్తున్న వారందరికీ వేదిక కల్పించాలనుకొని 2020లో ‘సర్కిల్ ఎక్స్’ ప్రారంభించారు. ఇదో క్లౌడ్ ఆధారిత వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం. సున్నా వృథా లక్ష్యంగా పనిచేస్తోంది ఇది. దీనిలో సంస్థలు, రీసైక్లింగ్ చేసే వారు అనుసంధానమై ఉంటారు. చేతివృత్తులు చేసే మహిళలు, సృజనాత్మకతకు పనిచెప్పే వారికీ చోటిచ్చారు. వారి ఉత్పత్తులకీ మార్కెటింగ్ చేస్తారు. ప్రస్తుతం దీనిలో పదివేలకుపైగా సభ్యులున్నారు. నెలకు పదివేల టన్నుల వ్యర్థాలకు అర్థం కల్పిస్తున్నారు. ఏడాదిలోనే 914 శాతం వృద్ధి సాధించామని చెబుతున్న వీరు.. ఒకరి ఆలోచనలు మరొకరికి నచ్చి 2019లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్ల ఆలోచనలు చూసి ఎన్నో సంస్థలూ పెట్టుబడికి ముందుకొస్తున్నాయి. పర్యావరణానికి సాయం, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న వీళ్ల వ్యాపారం బాగుంది కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!