రెండు సార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
కొంతమందికి ఆమెని చూస్తే నవ్వురావొచ్చు... మరికొంతమందికి ‘అయ్యోపాపం’ అనిపించొచ్చు... ఎవరేమనుకున్నా.. ఎన్నో హేళనలనీ, అవమానాలని ఎదుర్కొంటూ పెద్ద పోరాటమే చేస్తోంది స్వాతి.
కొంతమందికి ఆమెని చూస్తే నవ్వురావొచ్చు... మరికొంతమందికి ‘అయ్యోపాపం’ అనిపించొచ్చు... ఎవరేమనుకున్నా.. ఎన్నో హేళనలనీ, అవమానాలని ఎదుర్కొంటూ పెద్ద పోరాటమే చేస్తోంది స్వాతి. మరుగుజ్జుతనం శరీరానికే కానీ... మనసుకి కాదని నిరూపిస్తోంది. తన జీవితానుభవాలనే యూట్యూబ్‌లో పంచుకుంటూ లక్షల మందిలో స్ఫూర్తిని రగిలిస్తోంది...
మాది కొత్తగూడెం. నాన్న శంకర్, అమ్మ ప్రాణి. అన్నయ్య, నేనూ. అమ్మ మామూలుగానే ఉండేది కానీ.. నాన్న పొట్టి. నేనూ అన్నయ్య, ఆయనలానే మూడడుగులకు కొంచెమెక్కువ. చిన్నతనం నుంచీ మమ్మల్ని చూసి ఎగతాళి చేసేవారే ఎక్కువ. కాలేజీకొచ్చాక జుట్టు లాగడం, వెనక నుంచి నెట్టడం, కొట్టడం చేసేవారు. ‘నువ్వు బెంచీ మీద కూర్చొన్నా నిల్చున్నా ఒకటే’ అంటూ ఏడిపించేవారు. రెండుసార్లు ఆత్మహత్యకీ ప్రయత్నించా. తట్టుకోలేక ఇంటరయ్యాక చదువాపేశా. అన్నయ్యకి మాటలు రావు. 21 ఏళ్లవరకూ మందుల మీదే బతికాడు. అందుకే నాన్న ఆశలన్నీ నా మీదే! చదువు మానేశాక ఏడాదికి వెంకీ ఫోన్ చేశాడు. తనదీ మా కాలేజే. కానీ పరిచయంలేదు. ఇష్టపడుతున్నానంటే ఎవరో ఏడిపిస్తున్నారనుకున్నా. వార్నింగ్ ఇచ్చినా తనుమాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేరుగా కలిసినప్పుడూ ‘నేన్నిన్ను పెళ్లి చేసుకుంటా’ననే మాటే! నేను అందరిలా పనిచేయలేను. ఆరోగ్యం బాగోదు, నడిచినా ఆయాసం వస్తుందని చెప్పా. ఓరోజు ఏకంగా వాళ్లమ్మా వాళ్లని మా ఇంటికి తీసుకొచ్చారు. నన్ను చూశాక వాళ్లు ససేమిరా అన్నారు. తనేమో పట్టుబట్టాడు. ఆ పట్టుదల చూసే నాన్న ఉద్యోగం లేకపోయినా నన్నిచ్చి పెళ్లి చేశారు. తన ఫైనాన్స్ వ్యాపారం చూసుకోనిచ్చారు.
అలా యూట్యూబ్‌లోకి...
టైపింగ్, కంప్యూటర్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించా. అతికష్టమ్మీద ఒకటి సంపాదిస్తే అక్కడా ఎగతాళే. ఏడుస్తూ వచ్చేశా. ఆ తర్వాత నాన్నతో కలిసి ఎంఎల్ఏ, మంత్రుల చుట్టూ తిరిగా. వాళ్లని కలవడానికి రోజుల తరబడి రోడ్లమీద వేచిచూశాం. ఎత్తి రోడ్డుమీద పడేసేవాళ్లు. నన్ను నేను నిరూపించుకోవాలని 2018లో టిక్టాక్లోకొచ్చా. 3 లక్షల ఫాలోవర్లు ఉండటంతో ఒక యాప్ వాళ్లు రోజుకు 2 గంటలు పనిచేసేలా అవకాశమిచ్చారు. స్కిట్లు, డ్యాన్స్ చేసేదాన్ని. రెండు వారాలకు రూ.20వేలు ఇచ్చేవారు. టిక్‌టాక్ బ్యాన్‌తో 2019లో ‘వెంకీస్వాతి’ పేరుతో యూట్యూబ్లోకొచ్చా. నా జీవితం గురించే పంచుకుంటుంటా. ఇప్పుడు 3.87 లక్షల మంది అనుసరిస్తున్నారు.
ఇక్కడా కావాల్సినంత నెగెటివిటీ. ‘నీలాంటి అమ్మాయిని చేసుకోవడమే ఎక్కువ’అంటూ వ్యాఖ్యలు, నెగెటివ్ వీడియోలు పెట్టేవారు. ఆయన్ని చేసుకొని తన జీవితం పాడు చేశానా అనిపించేది. మిధున పుట్టే వరకూ అత్తయ్యావాళ్లూ మాతో సరిగా మాట్లాడలేదు. నేను పుట్టడమే దండగనుకున్నా. కానీ జీవితం విలువ నాన్న కొవిడ్‌తో చనిపోయాకే తెలిసింది. ఆఖరిచూపూ దక్కలేదు. ఆర్థికంగానూ చితికిపోయాం. అమ్మనైనా బాగా చూసుకోవాలని.. వేరే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. కొన్ని టీవీషోలకీ ఎంపియ్యా. కానీ యూట్యూబ్‌కి చేయొద్దన్నారు. ఇచ్చే మొత్తమూ తక్కువే. దాంతో వాటిని వదులుకున్నా. వ్యాపారవేత్తగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నా. నా పాప నన్ను చూసి జాలి పడకూడదు. గర్వపడాలి. అదే నా లక్ష్యం.
అది పునర్జన్మే!
నేను గర్భవతినని తెలిసెంత సంతోషపడ్డానో! కొన్ని ఆసుపత్రుల్లో పరీక్ష చేయడానికీ ఒప్పుకోలేదు. ‘నువ్వు కనలేవు. కన్నా నీలాగే పుడతారు. అబార్షన్ చేయించుకో’ ఏ ఆసుపత్రికెళ్లినా ఇదే సమాధానం. పెద్ద ఆసుపత్రుల వాళ్లూ మూడో నెల తర్వాత మోయలేవన్నారు. అబార్షన్కీ సిద్ధమయ్యారు. బిడ్డతోపాటు తల్లికీ ప్రమాదమనడంతో మావారూ సరేనన్నారు. నేనే ఒప్పుకోలేదు. మా ఫ్యామిలీ డాక్టర్ సలహాతో ఖమ్మంలో ఒక హాస్పిటల్‌కి వెళ్లాం. అక్కడ డాక్టర్ ఉష నేను ప్రయత్నిస్తా.. ఏడో నెలవరకు ధైర్యంగా ఉంటే చాలన్నారు. బిడ్డ బరువుకి వెన్ను నొప్పి ఎక్కువైంది. ఊపిరాడేది కాదు. మధ్యలో టైఫాయిడ్ కూడా. సమయానికి నన్ను తీసుకెళ్లడానికి ఆటో దొరికేది కాదు. నా పరిస్థితి చూసి అమ్మ ఏడ్చేసేది. కానీ చిన్నారి మిధునను చూశాక అవన్నీ మర్చిపోయా. మళ్లీ కొత్తగా పుట్టాననిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
అనుబంధం
- చాటింగ్ చూసి నమ్మలేకపోయా...!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!