అందుకు సిగ్గెందుకు!
లైంగిక విజ్ఞానం ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరికీ అవసరమే. ఆడవాళ్లకి కాస్త ఎక్కువ అవసరం. అప్పుడే వాళ్లు వాళ్లపై జరుగుతున్న లైంగిక దాడి, గృహహింస, అవాంఛిత గర్భాలు, గర్భస్రావాల గురించి తెలుసుకోగలుగుతారు. వాటికి వ్యతిరేకంగా పోరాడగలుగుతారు. కానీ మనదేశంలో లైంగిక విజ్ఞానం గురించి మాట్లాడటం, చర్చించడం అపరాధ విషయాలు.
లైంగిక విజ్ఞానం ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరికీ అవసరమే. ఆడవాళ్లకి కాస్త ఎక్కువ అవసరం. అప్పుడే వాళ్లు వాళ్లపై జరుగుతున్న లైంగిక దాడి, గృహహింస, అవాంఛిత గర్భాలు, గర్భస్రావాల గురించి తెలుసుకోగలుగుతారు. వాటికి వ్యతిరేకంగా పోరాడగలుగుతారు. కానీ మనదేశంలో లైంగిక విజ్ఞానం గురించి మాట్లాడటం, చర్చించడం అపరాధ విషయాలు. చాటుమాటుగానే మాట్లాడుకొనే అంశాలు మాత్రమే. మా అమ్మానాన్న ఇద్దరూ వైద్యులే. మా ఇంట్లో కూడా దీన్ని మాట్లాడకూడని విషయంగానే గోప్యంగా ఉంచారు. కానీ వెనిరియాలజీ (ఒకరినుంచి ఒకరికి సంక్రమించే లైంగిక అనారోగ్యాల గురించి తెలుసుకొనే శాస్త్రం) చదవడం కోసం సిడ్నీ వెళ్లాక నా దృష్టి కోణం పూర్తిగా మారింది. లైంగిక విజ్ఞానం ఎంత తెలుసుకొంటే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు అంతగా తగ్గుతాయి.
- డాక్టర్ నివేదిత మనోకరన్, వెనిరియాలజిస్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.