అప్పుడే.. అసలైన సాధికారత!

‘అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి’... మా అమ్మ చిన్నప్పటి నుంచీ నాకు నేర్పిన పాఠమిది.  నేను పాటించే సూత్రం కూడా. నీ తండ్రి, భర్త ... ఎవరైనా కానీ.. వాళ్లమీద ఆధారపడొద్దు. నీ ఖర్చులకు

Published : 16 Sep 2022 00:27 IST

‘అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి’... మా అమ్మ చిన్నప్పటి నుంచీ నాకు నేర్పిన పాఠమిది.  నేను పాటించే సూత్రం కూడా. నీ తండ్రి, భర్త ... ఎవరైనా కానీ.. వాళ్లమీద ఆధారపడొద్దు. నీ ఖర్చులకు బాధ్యత నీదే అవ్వాలి. అమ్మాయిగా ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం నీ విధి అంటూ పెంచుతారు. కానీ.. నీ రోజువారీ ఖర్చులకు సంపాదించుకునే, స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొనే హక్కు సంపాదించుకోవడమే అసలైన సాధికారత. అవకాశాలూ వెతుక్కుంటూ వస్తాయని కూర్చోవద్దు. ఎవరిమీదా ఆధార పడొద్దు. నీకోసం నువ్వే పోరాడాలి. సంపాదించినంత మాత్రాన ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టకూడదు. భవిష్యత్తు గురించీ ప్రణాళికుండాలి. ఖర్చు పెట్టగా మిగిలింది దాచుదామనుకోకుండా.. దాచగా మిగిలిన దాన్నే ఖర్చు చేయాలి. ఆర్థిక భద్రతే మనలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రధాన ఆయుధం.

- ప్రియాంక చోప్రా, నటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని