చదువు విలువేంటో.. ఆమెను అడగండి!
ఏడేళ్ల కిందట ఇదే వేదికమీద విద్య ప్రాధాన్యం గురించి మాట్లాడా. చదువుకోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన టీనేజ్ అమ్మాయిగా నా మాట ప్రపంచానికి వినిపిస్తుందని ఆశించా. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల
ఏడేళ్ల కిందట ఇదే వేదికమీద విద్య ప్రాధాన్యం గురించి మాట్లాడా. చదువుకోసం బుల్లెట్లకు ఎదురెళ్లిన టీనేజ్ అమ్మాయిగా నా మాట ప్రపంచానికి వినిపిస్తుందని ఆశించా. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రణాళికలో భాగంగా 2030 నాటికల్లా పిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పిస్తామని సభ్య దేశాలూ, కార్పొరేట్ సంస్థలూ, స్వచ్ఛంద సంస్థలూ మాటిచ్చాయి. అందులో సగం రోజులు గడిచిపోయినా ఇప్పటికీ మనం విద్యాపరమైన అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. తాలిబన్లు అమ్మాయిల్ని చదువుకు దూరం చేస్తున్నారు. ఇథియోపియాలో అస్థిరత, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా బాలికలు బడికి దూరమవుతున్నారు. విద్యవల్ల జీవితాలు మెరుగవుతాయి, ఆర్థిక వ్యవస్థలు బలపడతాయి, శాంతి నెలకొంటుంది. అమ్మాయిలకు భద్రమైన, నాణ్యమైన, ఉచిత విద్యని అందిస్తే ప్రతి దేశం, సమాజం, సంస్థ లాభపడుతుంది. ఈ విషయంలో సందేహం ఉంటే ఏ అమ్మాయిని అడిగినా చెబుతుంది... చదువు తన జీవితానికి ఎంత ముఖ్యమో. మీ నుంచి కంటితుడుపు మాటలు కాదు, శాశ్వతమైన మార్పు తెచ్చేందుకు వాగ్దానం కావాలి. ప్రపంచ నాయకులు నిజంగా బాలలకు భద్రమైన, సుస్థిరమైన భవిష్యత్తును ఇవ్వాలనుకుంటే తక్షణమే విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రతి దేశమూ బడ్జెట్‌లో 20% విద్యకే కేటాయించాలి.
- మలాలా యూసఫ్‌జాయ్,
ఐరాస శాంతి దూత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
(ఐరాస సర్వసభ్య సమావేశంలో విద్యపైన ప్రత్యేక సదస్సులో మాట్లాడుతూ)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.