లోక కల్యాణం కోసం!

మరి కొన్ని గంటల్లో పెళ్లంటే హడావుడి ఎలా ఉంటుందో తెలిసిందే. కానీ ఫొటోలో కనిపిస్తున్న ఈ పెళ్లికూతురు సుజిష మాత్రం ఆ సమయంలోనూ సామాజిక బాధ్యతని మర్చిపోలేదు. ఈమెది కేరళలోని మళప్పురం జిల్లా, పూగొట్టుమ్‌బదమ్‌ పట్నం.

Published : 22 Sep 2022 00:59 IST

రి కొన్ని గంటల్లో పెళ్లంటే హడావుడి ఎలా ఉంటుందో తెలిసిందే. కానీ ఫొటోలో కనిపిస్తున్న ఈ పెళ్లికూతురు సుజిష మాత్రం ఆ సమయంలోనూ సామాజిక బాధ్యతని మర్చిపోలేదు. ఈమెది కేరళలోని మళప్పురం జిల్లా, పూగొట్టుమ్‌బదమ్‌ పట్నం. ఈనెల 11న ఆమెకు సుబిన్‌తో పెళ్లైంది. పెళ్లి వేదిక దగ్గరకు బయలుదేరిన సందర్భంలో గుంతలమయంగా ఉన్న రోడ్డుని దాటుతున్న ఈమె ఆ ఫొటో, వీడియోల్ని ఇన్‌స్టాలో పెట్టగా దాదాపు 50 లక్షల వీక్షణలు వచ్చాయి. ‘ఈ ఫొటోలు ముందస్తు ప్రణాళికతో తీసినవి కాదు. ఆరోజే నా పెళ్లి.. ఉదయం బ్యూటీపార్లర్‌కి వెళ్తుంటే రోడ్డంతా గుంతల మయంగా ఉంది. ముస్తాబై తిరిగొస్తుండగా రోడ్డుమీద ఫొటోగ్రాఫర్‌ ఆశిక్‌ ఫొటోలు తీస్తుంటే.. అక్కడున్న గుంతల్ని, వాటిని తప్పించుకుంటూ వెళ్లడానికి వాహనదారులు, పాదచారులు పడుతున్న తిప్పల్ని చూసి చాలా బాధేసింది. అందుకే అవీ కనిపించేలా తియ్యమన్నా. తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే ప్రయోజనం ఉంటుందనుకున్నాం.

తక్షణ స్పందన

మా ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యి, స్థానిక అధికారుల దృష్టికీ రావడంతో వెంటనే అక్కడే కాదు మా ఊళ్లో అన్ని రోడ్ల గుంతలనూ  పూడ్చేశారు. ఈ మార్పుని, అదీ ఇంతవేగంగా అస్సలు ఊహించలేదు. స్నేహితులూ, బంధువులే కాదు.. ఊరందరి నుంచీ ప్రశంసలతో కూడిన మెసేజ్‌లు వెల్లువలా వస్తున్నాయి’ అంటూ తన సంతోషాన్ని ‘వసుంధర’తో పంచుకుంది సుజిష. ఈమె భర్త వ్యాపారి. డిగ్రీ చేసిన సుజిష పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి మంచి అధికారిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్