పోస్టు పెడితే.. కోట్లు రాలాల్సిందే!
సామాజిక మాధ్యమం.. మన ఆనందాలు, ఆలోచనలు పంచుకునే వేదిక. మరి వీళ్లకో..! ఒక్క పోస్టు పెడితే చాలు.. లక్షల మంది అభిమానుల్నే కాదు.. రూ.కోట్లు సంపాదించుకునే మార్గం. అలా భారీ మొత్తాల్ని సంపాదించుకుంటున్న కొందరు వీళ్లు..
సామాజిక మాధ్యమం.. మన ఆనందాలు, ఆలోచనలు పంచుకునే వేదిక. మరి వీళ్లకో..! ఒక్క పోస్టు పెడితే చాలు.. లక్షల మంది అభిమానుల్నే కాదు.. రూ.కోట్లు సంపాదించుకునే మార్గం. అలా భారీ మొత్తాల్ని సంపాదించుకుంటున్న కొందరు వీళ్లు..
పిన్న వయసు బిలియనీర్
కైలీ జెన్నర్
ఇన్‌స్టా ద్వారా భారీ మొత్తాన్ని సంపాదిస్తున్న అమ్మాయిల్లో ఈ ఏడు కైలీదే అగ్రస్థానం. ఈ అమెరికన్.. పదిహేనేళ్లకే మోడలైంది. ఆపై రియాలిటీ షోలు, సినిమాలతో పేరు తెచ్చుకోంది. వస్త్రశ్రేణి, కైల్ పేరుతో కాస్మొటిక్స్‌తోపాటు అనేక వ్యాపారాలున్నాయి. స్వశక్తితో ఎదిగిన పిన్న వయసు బిలియనీర్‌గా 2019-ఫోర్బ్స్‌లో, 2020లో స్వశక్తితో ఎదిగిన 100-శ్రీమంతుల జాబితాలో నిలిచింది. దాతృత్వంలోనూ ముందుంటూ.. గ్రహణ మొర్రి, న్యూట్రిషన్ లోపం ఉన్న పిల్లలకు కోట్లరూపాయలు సాయం చేస్తోంది. 25 ఏళ్ల కైలీ ఖాతాను 37 కోట్లమంది అనుసరిస్తున్నారు. ఒక పోస్టుకు రూ.15 కోట్లు తీసుకుంటుంది.
35 కోట్ల ఫాలోయర్లు..
‘సెలెనా గోమెజ్
పుట్టింది టెక్సాస్. బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. గాయని కూడా. మొదట్లో బ్యాండ్‌తో కలిసి చేసినా తర్వాత సోలోగా ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది. తన ఆల్బమ్స్ బిల్‌బోర్డ్ హాట్ 100 జాబితాలో తొలి పదిలోనే ఉండేవి. ఇన్‌స్టాలో 10కోట్ల ఫాలోయర్లను సంపాదించిన తొలి అమ్మాయి. పిల్లల్లో అనారోగ్యం, తాగునీరు, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 17 ఏళ్లకే యునిసెఫ్ అంబాసిడర్. ఎన్నో వ్యాపార సంస్థలకు ప్రచారకర్త. 30ఏళ్ల సెలెనా.. ‘సెలెనా గ్రేస్’ ‘రేర్ బ్యూటీ’ అనే లగ్జరీ గూడ్స్ సంస్థలనీ ప్రారంభించింది. ఇన్‌స్టాలో 34.8 కోట్ల ఫాలోయర్లున్న తను ఒక్కో పోస్టుకు రూ.14 కోట్లు తీసుకుంటుంది.
ఖాతా విలువ 37 కోట్లు
- ఆష్నా ష్రాఫ్
దేశీ ఇన్‌ఫ్లుయెన్సర్లలో సాధారణ అమ్మాయిల్లో ఎక్కువ మొత్తం ఆదాయం తనదే. ఆష్నా చిన్నతనంలో ఎవరితోనూ కలిసేదికాదు. దాన్ని పోగొట్టాలని వాళ్లమ్మ మోడలింగ్ వైపు ప్రోత్సహించింది. ఇంటీరియర్ డిజైనింగ్ చదివిన తను 2013లో ఆన్‌లైన్ బ్యూటీ సంస్థ ‘ద స్నాబ్ షాప్’, ‘ద స్నాబ్ జర్నల్’ యూట్యూబ్ ఛానెల్‌లను ప్రారంభించింది. తన ఫ్యాషన్, మేకప్ చిట్కాలు యువతని ఆకట్టుకుంటాయి. నైకా, మెబిలిన్, ఎస్‌టీ వంటి పెద్ద సంస్థలతో పనిచేసింది. ఆ తర్వాత ఇన్‌స్టాకు మారింది. అనుసరించే వారి సంఖ్య పదిలక్షల్లోపే! కానీ ఎక్కువ మందిని ఆకర్షించడం, ఆకట్టుకునే పోస్ట్‌లు ఈమె ప్రత్యేకతలు. పోస్ట్‌కు రూ.3 లక్షల వరకూ తీసుకునే 29 ఏళ్ల ఆష్నా ఖాతా విలువ రూ.37 కోట్లు.
దేశీ స్టార్లలో ఇన్‌స్టా నుంచి పెద్దమొత్తం అందుకుంటున్నది ప్రియాంకచోప్రా. 8.2 కోట్ల ఫాలోయర్లున్న ఈ గ్లోబల్ స్టార్ ఒక్కో పోస్టుకు రూ.3 కోట్లకుపైగా తీసుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.