మిమ్మల్ని మీరు నమ్మండి!

తాతయ్య బలవంతమ్మీద చిన్నతనంలోనే ఆటల్లోకి వచ్చా. హాకీ కిట్‌ కొనేంత స్థోమతా లేని కుటుంబం మాది. పైసా పైసా కూడబెట్టి కొన్నారు. బరువైన కిట్‌తో బస్సుల్లో ప్రయాణించడం కష్టమనిపించేది.

Published : 27 Oct 2022 00:19 IST

అనుభవ పాఠాలు

తాతయ్య బలవంతమ్మీద చిన్నతనంలోనే ఆటల్లోకి వచ్చా. హాకీ కిట్‌ కొనేంత స్థోమతా లేని కుటుంబం మాది. పైసా పైసా కూడబెట్టి కొన్నారు. బరువైన కిట్‌తో బస్సుల్లో ప్రయాణించడం కష్టమనిపించేది. ఇంట్లో వాళ్ల కోసమే కొనసాగుతూ వచ్చా. 2008లో జట్టులో చోటు సంపాదించినప్పుడు ఆశ్చర్యం. ఏడుగురు గోల్‌ కీపర్లు ఉండేవారు. వాళ్లను దాటి ఎంపికవుతానని అస్సలు అనుకోలేదు. వార్తాపత్రికల్లో నా ఇంటర్వ్యూలొచ్చాయి. వాటిని మా తాతకి చూపించా. ఆయనకు చదువు రాదు. ఏం రాశారో చదవలేకపోయినందుకు బాధపడ్డారు. ఏడాదిలోగా కచ్చితంగా చదువుతానని మాటిచ్చి చేసి చూపించారు కూడా. నా ఆటను ఆయనెంత సీరియస్‌గా తీసుకున్నారో అప్పుడే అర్థమైంది. అప్పట్నుంచి నేనూ సీరియస్‌గా ఆడటం మొదలుపెట్టా. ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు తెచ్చుకున్నా. రెండుసార్లు గోల్‌ కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచా. అమ్మాయిలూ.. మీరేం సాధించాలనుకున్నా ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. దానికి కష్టం తోడైతే సాధించలేనిది ఏదీ లేదు. 32 ఏళ్ల వయసులో భారత జట్టుకు సారథ్యం వహించగలుగుతున్నానంటే నేను పాటిస్తున్న ఈ సూత్రమే కారణం.

- సవిత పునియా, భారత హాకీ జట్టు కెప్టెన్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని