ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా..మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

Updated : 07 Nov 2022 10:59 IST

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా..
మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

అనుభవంలో తెలుసుకున్నా!

ఫుడ్‌సైన్స్‌లో మాస్టర్స్‌ తర్వాత రిసెర్చ్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డెవలపర్‌గా వివిధ సంస్థల్లో పనిచేశా. సాంకేతికత, ప్రొడక్ట్‌ డెవలపింగ్‌, మార్కెటింగ్‌పై అవగాహన వచ్చింది. అయితే నా దిశను మార్చింది మాత్రం.. 2016లో జరిగిన బైకు ప్రమాదం. కోలుకోవడానికి 8నెలలు పట్టింది. కుడిచేతికి సర్జరీ అయ్యింది. వంట చేసుకోవటం ఇబ్బందై రెడీమేడ్‌ ఫుడ్స్‌పైనే ఆధారపడ్డా. అప్పుడే భారత ఎఫ్‌ఎంసీజీ రంగమంతా చక్కెర, పిండి పదార్థాలతో నిండిపోవడం గుర్తించా. వీటిని కాదని కీటో ఆహారంపై దృష్టిపెట్టా. దాన్ని గమనించిన నా బాల్యస్నేహితుడు సురేశ్‌రెడ్డి వీటిని మరింత మందికి చేరువ చేస్తే బాగుంటుందన్నాడు. తను ఇంజినీర్‌. ఆలోచన నచ్చి, అధ్యయనం ప్రారంభించాం. ప్రధాన నగరాలన్నింట్లో వినియోగదారుల అభిప్రాయాలు సేకరించాం. చిరుతిళ్లకు దేశంలో ఉన్న ప్రాధాన్యమేంటో తెలిసొచ్చింది. వీటితో వచ్చే అనారోగ్యాలపై అవగాహన లేనివారు కొందరైతే, వేరే దారిలేక వీటిపై ఆధార పడుతున్నామన్నవారు కొందరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘లో కార్బ్‌, హై ప్రొటీన్‌, మల్టీగ్రెయిన్‌, కీటో’ ఆహారాలపై దృష్టిపెట్టాం.

ఏడాదిన్నరలోనే..

2019 చివర్లో కొన్నిరకాల చిప్స్‌ తయారు చేసి, అందరికీ పంచాం. మంచి స్పందన వచ్చింది. సూచనలకు తగ్గ మార్పులు చేసి 2020 సెప్టెంబరులో ఫుడియో.ఫిట్‌ ప్రారంభించాం. చిప్స్‌, స్నాక్స్‌, చాక్లెట్లు, మల్టీగ్రెయిన్‌ పిండ్లు.. వంటి 50 రకాల ఉత్పత్తులు అందిస్తున్నాం. మరో 200 సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ నిల్వకారకాలు, కృత్రిమ రంగులు లేనివే. వెబ్‌సైట్‌తోపాటు దేశవ్యాప్తంగా 50నగరాల్లోని 1500కి పైగా స్టోర్లలో విక్రయిస్తున్నాం. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. అమెరికా, ఇంగ్లండ్‌ దేశాల్లో ఆదరణ ఎక్కువుంది. రూ.40లక్షలతో మొదలైన సంస్థ ప్రతి నెలా 25% ప్రగతిని సాధిస్తోంది. గత ఏడాది కోకోనట్‌ వాటర్‌ సాచెట్లనూ తీసుకొచ్చాం. తొలిరోజే 5వేల ఆర్డర్లొచ్చాయి. మా ప్రయాణంలోనూ సవాళ్లున్నాయి. లాక్‌డౌన్‌లో ఉత్పత్తుల సరఫరా ఇక్కట్లు వంటి ఇబ్బందులెన్నో. ఓపిగ్గా దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు రోజుకు 10వేలకుపైగా ఉత్పత్తులను అమ్ముతున్నాం. ఫుడియో.ఫిట్‌ను భారతీయుల ఆహార పదార్థాల జాబితాలో ఒకటిగా నిలిపే లక్ష్యంతో సాగుతున్నాం.

- కె.ముకుంద, బెంగళూరు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్