పరిధులు దాటి ప్రయత్నించండి!

చిన్నప్పుడు మా నాన్న నాకో సలహా ఇచ్చారు. ‘ఏదైనా సౌకర్యవంతంగా అనిపిస్తే.. అక్కడే ఉండి పోవాలనుకోవద్దు. నీకు సవాల్‌ విసిరేదేంటని వెతుక్కుంటూ వెళ్లు.. గొప్ప స్థాయికి చేరుకుంటా’వన్నారు.  ఇది నా మనసులో నాటుకుపోయింది. దీన్ని ప్రయత్నించడం 14 ఏళ్ల నుంచే ప్రారంభించా.

Updated : 11 Nov 2022 04:13 IST

అనుభవపాఠం

చిన్నప్పుడు మా నాన్న నాకో సలహా ఇచ్చారు. ‘ఏదైనా సౌకర్యవంతంగా అనిపిస్తే.. అక్కడే ఉండి పోవాలనుకోవద్దు. నీకు సవాల్‌ విసిరేదేంటని వెతుక్కుంటూ వెళ్లు.. గొప్ప స్థాయికి చేరుకుంటా’వన్నారు.  ఇది నా మనసులో నాటుకుపోయింది. దీన్ని ప్రయత్నించడం 14 ఏళ్ల నుంచే ప్రారంభించా. ఇంటికి దూరంగా పాఠశాలలో చేరడం, ఆసక్తి లేకపోయినా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా చేరడం, దానిపై పట్టు వచ్చిందని మార్కెటింగ్‌లోకి రావడం.. ఇవన్నీ ఇందుకు ఉదాహరణలే. ఫలితమేంటంటారా? నేనిప్పుడున్న స్థాయే! కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతిదీ కొత్తదే. ఏం చేయాలన్నా నేర్చుకోక తప్పదు. ఎవరూ మనల్ని చిన్న చూపు చూడొద్దు, మన ఉనికిని చాటాలి అనుకున్నప్పుడు మామూలుగా కంటే ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం. తెలియకుండానే పోటీతత్వం అలవడుతుంది. కాబట్టి, హమ్మయ్య.. ఇప్పటికి సాగుతోంది కదా అని ఎప్పుడూ అనుకోవద్దు. పరిధుల్ని దాటి కొత్తగా చేయడంపైనే దృష్టిపెట్టండి. ప్రపంచమే మిమ్మల్ని నాయకురాలిని చేస్తుంది.

- అంజలీ సుద్‌, సీఈఓ, విమియో

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని