మనల్ని మనం కోల్పోవద్దు!
హిమాచల్ ప్రదేశ్‌లో చేస్తున్న రోజులవి! ఈవ్‌టీజింగ్‌పై రోజూ అమ్మాయిల నుంచి ఎన్ని ఫిర్యాద]ులో! తీరా వెళితే.. అప్పటికి పారిపోయేవారు.
అనుభవ పాఠం
హిమాచల్ ప్రదేశ్‌లో చేస్తున్న రోజులవి! ఈవ్‌టీజింగ్‌పై రోజూ అమ్మాయిల నుంచి ఎన్ని ఫిర్యాదులో! తీరా వెళితే.. అప్పటికి పారిపోయేవారు. ఇలాకాదని పెప్పర్ స్ప్రే తయారు చేయడం నేర్పించి, వాళ్లకి మీరే బుద్ధి చెప్పండని అమ్మాయిల్ని ప్రోత్సహించా. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. తర్వాత ఎన్నో క్రిమినల్, డ్రగ్ కేసులను ఛేదించా. దీంతో ‘టఫ్ ఆఫీసర్’ అన్న పేరు వచ్చింది. ఇది ఒకవైపు! ఇంటికి వెళ్లానంటే అమ్మానాన్నల గారాలపట్టినై పోతా. అమ్మ చెప్పినట్టు ఉదయాన్నే పూజ చేస్తా. ఆఫీసు సమయం అవుతోందంటూ పరుగులు పెడతా. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతా, కవితలు రాస్తా. నేను కెరియర్ మొదలుపెట్టింది ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా! సమాజానికి సాయపడాలని సివిల్స్ రాశా. బ్యాంక్‌లో చేసినా, పోలీసునైనా సమర్థంగా పనిచేయడంపైనే నా దృష్టి. అందుకని నా వ్యక్తిగత జీవితాన్ని వదులుకో లేదు. రెంటికీ సమప్రాధాన్యమిస్తా కాబట్టే.. విజయవంతంగా సాగగలుగుతున్నా. మీరూ అంతే.. కెరియర్‌లో పడి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. మీకంటూ కాస్త సమయం కేటాయించుకోండి. రాణించడం ఖాయం!
- సౌమ్య సాంబశివన్, ఐపీఎస్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.