సాధించే దాకా నిద్రపోను!

ఇవాళ ఈ స్టంట్‌ లేదా ఎక్సర్‌సైజ్‌ చేయాలి అనుకుంటే అది చేసేవరకూ నిద్రపోను. ఆ సమయంలో తిండి కూడా గుర్తుకు రాదు.

Updated : 21 Nov 2022 03:07 IST

అనుభవపాఠం

ఇవాళ ఈ స్టంట్‌ లేదా ఎక్సర్‌సైజ్‌ చేయాలి అనుకుంటే అది చేసేవరకూ నిద్రపోను. ఆ సమయంలో తిండి కూడా గుర్తుకు రాదు. విఫలమయ్యే కొద్దీ మరింత ప్రయత్నిస్తా. ఇదీ నా స్వభావం. మన దేశం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్లిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా నేను మీకు పరిచయమే! కానీ.. మొదట్లో ‘నువ్వు జిమ్నాస్ట్‌ అవ్వడానికి పనికి రావు’ అన్నారని తెలుసా? కారణం నా అరి పాదాలు. జిమ్నాస్ట్‌లకు ఒంపు తిరిగి ఉండాలి. కానీ నావి చదునుగా ఉండేవి. వదిలేసి, ఇంకో ఆట చూసుకో అన్నారంతా. కానీ నేనలా వదల దలచుకోలేదు. అరి పాదాలు మారడానికి 15 ఏళ్లు కష్టపడ్డా. జిమ్నాస్ట్‌ అవ్వలేవు అన్న ఆ మాటే నా పట్టుదలను పెంచింది. ఒలింపిక్స్‌ వరకూ తీసుకెళ్లింది. ఇప్పటికీ అంతే.. ఎవరైనా ఏదైనా చేయలేవు అన్నారా.. సాధించే వరకూ నిద్రపోను. వాళ్లు అన్నారని కాదు.. నన్ను నేను నిరూపించుకోవాలన్న తపన. అద్దం ముందు నిలబడి నువ్వేం సాధించావ్‌ అన్న ప్రశ్నకు నీకు నువ్వు సమాధానం ఇచ్చుకోగలిగితే చాలు. కాబట్టి, ప్రయత్నించి వదిలేయండి.. పర్లేదు. చేయలేనని మాత్రం వెనకడుగేయొద్దు.. నా సలహా ఇది!

- దీపా కర్మాకర్‌, జిమ్నాస్ట్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్