కలలను మాత్రం కాల్చలేకపోయాడు..
యాసిడ్‌తో నా ముఖాన్ని మార్చ గలిగాడు, హృదయాన్ని కాదు. నా ముఖాన్ని తప్ప కలలను కాల్చలేక పోయాడు.
అనుభవపాఠం
యాసిడ్‌తో నా ముఖాన్ని మార్చ గలిగాడు, హృదయాన్ని కాదు. నా ముఖాన్ని తప్ప కలలను కాల్చలేక పోయాడు. అప్పుడు నేననుభవించిన శారీరక బాధ కన్నా... బంధువులు, స్నేహితులు సహా సమాజమంతా వెలేసిన బాధ ఎక్కువ. ఎనిమిదేళ్లపాటు చీకట్లో ఉన్నప్పుడు బతకాలనే పట్టుదల మరింత పెరిగింది. నా కథ అందరికీ చెప్పడానికైనా నేనుండాలనుకున్నా. బతకడం కష్టమన్నారు వైద్యులు. కలలను నిజం చేసుకొంటూ ముందుకు సాగుతున్న నన్ను వాడు చూడాలనే కసితో ఉండేదాన్ని. ఆ కోపం, లక్ష్యమే నన్ను బతికించాయి. పాడాలని, నృత్యం చేయాలని, నా దుస్తులను నేనే డిజైన్ చేసుకోవాలని, అందరితో కలిసి హాయిగా బతకాలని కలలు కనేదాన్ని. అయితే ఎవరిని చూసినా మొదట్లో భయంతో వణికి పోయేదాన్ని. క్రమేపీ నన్ను నేను మార్చుకోవడం నేర్చుకొన్నా. జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను అనుకొనే దాన్ని. సవాళ్లెన్నైనా ఎదుర్కొని పోరాడాలని నిశ్చయించుకొన్నా. అదే నాలాంటి వాళ్లకెందరికో చేయూత నందించే స్థాయికి చేర్చింది. నాలా యాసిడ్ దాడికి గురైన 27వేల మంది సంతకాలతో ఉన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ యాసిడ్ అక్రమ విక్రయాలకు సవాల్‌గా నిలిచింది. యాసిడ్ బాధితులకూ కలలుంటాయని ప్రపంచానికి చాటుతున్నా. ఛానవ్ ఫౌండేషన్ ద్వారా నాలాంటి వారికి సాయాన్ని అందించడానికి కృషి చేస్తున్నా. ఎవరో అవమానిస్తున్నారని మీరు ఆత్మనింద చేసుకోవద్దు. మనల్ని మనం ప్రేమిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అప్పుడే మన కల సాక్షాత్కారమవుతుంది.
- లక్ష్మి అగర్వాల్, యాసిడ్ బాధితురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.