Zahara Kanchwalla: ముందు మనమే మారాలి...

దేశంలో ప్రతి 100 మంది వ్యాపారవేత్తల్లో ఏడుగురే మహిళలు. యూనికార్న్‌ క్లబ్‌కి చేరిన 136 మందిలో అయిదుగురే ఆడవాళ్లు. ఎంత వ్యత్యాసం? ఉద్యోగినులుగా ఎంతోమంది రాణిస్తున్నా.. వ్యాపార రంగంలోకి రావడానికి భయపడే వారే ఎక్కువ.

Published : 19 May 2023 00:39 IST

జహరా కాంచ్‌వల్లా, సీఈఓ, రైట్‌ నాలెడ్జ్‌ ల్యాబ్స్‌

దేశంలో ప్రతి 100 మంది వ్యాపారవేత్తల్లో ఏడుగురే మహిళలు. యూనికార్న్‌ క్లబ్‌కి చేరిన 136 మందిలో అయిదుగురే ఆడవాళ్లు. ఎంత వ్యత్యాసం? ఉద్యోగినులుగా ఎంతోమంది రాణిస్తున్నా.. వ్యాపార రంగంలోకి రావడానికి భయపడే వారే ఎక్కువ. ‘ఓడిపోతే’ అన్న భయంతోనే సగం ఆలోచన చేయం. ‘మహిళలు.. ఏం చేయగలుగుతారు’ అన్న సందేహంతో పెట్టుబడిదారులూ ముందుకు రారు. ఏదైనా సాధిద్దామని ఎవరైనా కాస్త ఉత్సాహంగా ఉన్నా ‘అమ్మాయివి.. అంత దూకుడొద్దు’ అంటూ సలహాలు. అలాగని ఆగిపోదామా? ప్రోత్సాహం ఇంటి నుంచి మొదలై తర్వాత టీచర్లు, మెంటార్లు, సమాజం ఇలా కొనసాగాలన్నది నిజమే. అయితే మన వంతు ప్రయత్నమూ కావాలి. డిజిటల్‌ కంటెంట్‌.. ఇప్పుడీ మాట సాధారణమే! దాదాపు దశాబ్దం క్రితం దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకొని ‘రైట్‌ నాలెడ్జ్‌ ల్యాబ్స్‌’ ప్రారంభించాం. కొత్త, ఎవరూ ప్రారంభించని దారిలో పయనమంటే ఒడుదొడుకులు సాధారణమే. అయినా నిలదొక్కుకున్నానంటే ఆత్మవిశ్వాసమే కారణం. ముందు మనపై మనకి, ఎంచుకున్న మార్గంపై నమ్మకం ఉండాలి. దానికి కష్టపడేతత్వం, అంకితభావం తోడైతే ఎవరైనా సాధించగలరు. ముందు... ‘చేయగలనా’ అంటూ కూర్చోక.. మీరు మారండి. నెట్‌వర్క్‌ని పెంచుకోండి. నేరుగానే కలవాలనేముంది? ఆన్‌లైన్‌ సాయం తీసుకోండి. అవకాశాలు తెలుస్తాయి.. వాటిని ఉపయోగించుకోవడమిక మీ వంతు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్