ఎక్కడ చదివామో కాదు..
‘అంబానీ ప్రిన్సెస్’.. చిటికె వేస్తే నచ్చినవి వండే చెఫ్‌లు, కోరిన దుస్తులు, ప్రత్యేక విమానాలు ముందుంటాయి అని అనుకుంటారు చాలామంది. కానీ మా చదువు విషయంలోనే కాదు.. ఖర్చుపెట్టే ప్రతి రూపాయి పైనా అమ్మ నిఘా ఉండేది.
- ఈషా అంబానీ, డైరెక్టర్, రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్
‘అంబానీ ప్రిన్సెస్’.. చిటికె వేస్తే నచ్చినవి వండే చెఫ్‌లు, కోరిన దుస్తులు, ప్రత్యేక విమానాలు ముందుంటాయి అని అనుకుంటారు చాలామంది. కానీ మా చదువు విషయంలోనే కాదు.. ఖర్చుపెట్టే ప్రతి రూపాయి పైనా అమ్మ నిఘా ఉండేది. మిగతా వారితో పోలిస్తే మాకిచ్చే పాకెట్‌మనీనే తక్కువ. ఒక్క రోజు స్కూలు మానేస్తామన్నా అమ్మ ఊరుకునేది కాదు. అంతటి క్రమశిక్షణ వల్లే నాన్న ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నా అనిపిస్తుంది. డబ్బు, సౌకర్యాలు, పెద్ద సంస్థల్లో చదివే వీలు కల్పిస్తుందేమో కానీ.. పరిజ్ఞానం మనమే సంపాదించుకోవాలి. కాబట్టి, ఎక్కడ చదివామన్నది కాదు.. ఎంత నేర్చుకున్నామన్నది ప్రధానం. ఎంత ఎదిగినా, ఏం చేస్తున్నా ఎప్పుడూ నేర్చుకోవడానికి ముందుండండి. పొగడ్తలు, తెగడ్తలేవైనా ఒకేలా తీసుకోండి. పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. మీపై మీరు నమ్మకం ఉంచుకొని, లక్ష్యాలను సాధించుకుంటూ వెళ్లండి. మన జీవితం, మన కలలు.. మనమే సాధించుకుంటూ వెళ్లాలి. దానికి ఒకరి గుర్తింపు అవసరం లేదు. అపజయాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దు. ఓటములను స్వీకరించడం అలవాటైతేనే జీవితంలో ముందుకు సాగగలం. నేను నమ్మే సూత్రమిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.