గగనయాత్రకు.. వ్యోమిత్ర

వ్యోమిత్ర.. ఇంతవరకూ శాస్త్రవేత్తలకి మాత్రమే తెలిసిన ఈ అమ్మాయి పేరు ఇక నుంచీ సామాన్యులకీ పరిచయం కానుంది. ఎందుకంటే మానవ సహిత అంతరిక్ష ప్రయాణం గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఈ వ్యోమిత్ర కీలకం మరి.

Updated : 30 Aug 2023 04:34 IST

వ్యోమిత్ర.. ఇంతవరకూ శాస్త్రవేత్తలకి మాత్రమే తెలిసిన ఈ అమ్మాయి పేరు ఇక నుంచీ సామాన్యులకీ పరిచయం కానుంది. ఎందుకంటే మానవ సహిత అంతరిక్ష ప్రయాణం గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఈ వ్యోమిత్ర కీలకం మరి. ఇంతకీ ఎవరీ అమ్మాయి. తెలుసుకోవాలనుందా?

క్కగా చీర కట్టుకుని... మెడలో ఐడీ కార్డు వేసుకుని కూర్చున్న ఆమె.. త్వరలో అంతరిక్ష ప్రయాణం చేయనున్న మహిళా రోబో. పేరు వ్యోమిత్ర. ఏఐ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించిన ఈ రోబో.. మనుషులు చేసే అన్ని పనులూ చేస్తుంది. హిందీ, ఆంగ్లభాషల్లో చక్కగా మాట్లాడుతుంది. అంతరిక్షనౌకలో తోటి వ్యోమగాములు చెప్పే విషయాలని అర్థం చేసుకోగలదు. సాంకేతికత పరమైన సందేహాలుంటే నివృత్తి చేయగలదు. అంతేకాదు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రాణాలూ కాపాడగలదు. ఇక అక్కడ నుంచి భూమికీ సమాచారాన్నిస్తుంది. వాతావరణ మార్పులపై హెచ్చరికలు అందిస్తుంది. ఏఐ పరిజ్ఞానంతో మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్తున్న మహిళా రోబోగా చరిత్ర సృష్టించనుంది వ్యోమిత్ర.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని