తారలు మెచ్చిన టీచర్లు!

విజ్ఞానంతోపాటు మంచి నడవడికనూ పాఠాలుగా బోధిస్తారు ఉపాధ్యాయులు. అందుకే.. తల్లీతండ్రి తర్వాత అంతటి ప్రాముఖ్యం గురువులకే ఇస్తాం. తమను ఈ స్థాయిలో నిలబెట్టిన కొందరు గురువులను పరిచయం చేస్తున్నారు మన నటీమణులు.

Published : 05 Sep 2023 01:42 IST

విజ్ఞానంతోపాటు మంచి నడవడికనూ పాఠాలుగా బోధిస్తారు ఉపాధ్యాయులు. అందుకే.. తల్లీతండ్రి తర్వాత అంతటి ప్రాముఖ్యం గురువులకే ఇస్తాం. తమను ఈ స్థాయిలో నిలబెట్టిన కొందరు గురువులను పరిచయం చేస్తున్నారు మన నటీమణులు. వాళ్లెవరో చూసేయండి.

అమ్మే..

-కృతి సనన్‌

నేను మెచ్చిన గురువెవరంటే మా అమ్మ గీతా సనన్‌ అని చెబుతా. చేయి పట్టి నడిపించినందుకు ఈ మాట చెప్పడం లేదు. తను వృత్తిరీత్యా ప్రొఫెసర్‌. అందరిలా మొదటి అక్షరం దిద్దించడమే కాదు విద్యాబుద్ధులూ చెప్పింది. మేథ్స్‌ అంటే అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. దానిపై ఆసక్తి కలిగేలా, సరదాగా నేర్చుకునేలా చేసింది. సబ్జెక్టు పాఠాలతోపాటు జీవిత పాఠాలనూ నేర్పి నేనీ స్థాయిలో నిలిచేలా చేసింది తనే.


నా స్నేహితురాలు

-అలియా భట్‌

రిత్ర పాఠాలు చెప్పే మా ఆషితా నాయక్‌ మేడమ్‌ అంటే చాలా ఇష్టం. టీచర్‌గా కంటే స్నేహితురాలిగా ఉండేవారు. చిన్న, పెద్ద సమస్య ఏదైనా నేరుగా ఆమె వద్దకు వెళ్లి చెప్పేదాన్ని. నిజాయతీతో ఉండటం, పరిస్థితి ఏదైనా ధైర్యంగా ఉండటం నాకు తనే నేర్పింది. ‘ఏ సమస్య అయినా మనం భయపడినంత పెద్దది కాదు.. కాస్త వేచి చూస్తే నీకే అర్థమవుతుంద’న్న ఆమె సలహా ఇప్పటికీ పాటిస్తా.


ఆమె బంగారం

-పూజా హెగ్డే

జెస్సికా దారువాలా.. మా జాగ్రఫీ టీచర్‌. పాఠాలు ఆసక్తిగా చెబితే చాలనుకునేవారు కాదావిడ. మనసులను చదివేవారు. ఆమె బంగారం. చిన్నతనంలో నేను వెనకబడి ఉన్నప్పుడు ప్రోత్సహించి వెన్నుతట్టేవారు. ఆమె నా పట్ల చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని