ఆ వలలో పడొద్దని.. ఓ వ్యాసం!

ఫోన్‌ లేకపోతే క్షణం తోయడం లేదు.. బోర్‌ కొడుతోంది.. ఈ మాటలు చాలాసార్లే వినుంటాం. కానీ అది లేనిదే జీవితం లేదు. అడుగు ముందుకు పడట్లేదు, చనిపోవాల్సి వస్తోంది అనేంత వరకూ వెళ్తున్నారని తెలుసా?

Updated : 09 Sep 2023 05:44 IST

ఫోన్‌ లేకపోతే క్షణం తోయడం లేదు.. బోర్‌ కొడుతోంది.. ఈ మాటలు చాలాసార్లే వినుంటాం. కానీ అది లేనిదే జీవితం లేదు. అడుగు ముందుకు పడట్లేదు, చనిపోవాల్సి వస్తోంది అనేంత వరకూ వెళ్తున్నారని తెలుసా? దీన్నే ‘నోమో ఫోబియా’ లేదా నో మొబైల్‌ ఫోన్‌ ఫోబియాగా చెబుతారు. ఈ అంశంపైనే పరిశోధన చేసింది వైష్ణవి విశ్వేశ్వరయ్య. ఈమెది హిందూపురం. హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కొన్నాళ్లు ఉద్యోగమూ చేసింది. తర్వాత అమెరికాలో కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ల్లో మాస్టర్స్‌ చేసింది. ఈ క్రమంలోనే తన ప్రొఫెసర్‌ వద్ద ‘నోమోఫోబియా’పై పరిశోధన చేసింది. ‘కొద్దిసేపు ఫోన్‌, ఇంటర్నెట్‌ లేకపోతే ఏమవుతుందోనన్న భయం ఆందోళన చాలామందిలో పెరిగిపోతోంది. కొవిడ్‌ తర్వాత ఈ పరిస్థితి అనుకుంటున్నాం కానీ 2019లోనే ఫోన్‌ వ్యసనంగా మారడం గమనించా. దీని తీవ్రతపై విశ్లేషణలు జోడిస్తూ పరిశోధన పత్రం సమర్పించా. అది క్లినికల్‌ అండ్‌ మెడికల్‌ ఇన్ఫోమాటిక్స్‌ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమై నాకు గుర్తింపునూ తెచ్చింది’ అంటోంది వైష్ణవి. అక్కను చూసి కంప్యూటర్స్‌ను కెరియర్‌గా ఎంచుకున్న ఈమె రోబోను చూసి ఏఐ దిశగా నడిచింది. ప్రస్తుతం అమెరికాలో ఓ ప్రముఖ సంస్థలో మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీరింగ్‌ మేనేజర్‌గా చేస్తోంది. లార్జ్‌ లాంగ్వేజెస్‌, చాట్‌ జీపీటీ, జనరేటివ్‌ ఏఐలపై పని చేస్తోంది.

- గొడిశెల వినయ్‌గౌడ్‌, ఈజేఎస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని