సూర్యరశ్మి లేకున్నా వీటిని పెంచుకోవచ్చు!

ఇంటిలోపల మొక్కల్ని పెంచుకోవాలనీ ఉన్నా... ఎదగవేమోననే చాలా మందికి ఓ సందేహం. అది నిజమే కానీ... దీపాల వెలుగులోనూ, పరోక్షంగా వచ్చే వెలుతురులోనూ పెంచుకోగల మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిపై ఎలా శ్రద్ధ చూపాలో తెలుసుకుంటే సరి. మీరు కోరుకున్నది సాధ్యమవుతుంది....

Updated : 12 Jun 2021 06:31 IST

ఇంటిలోపల మొక్కల్ని పెంచుకోవాలనీ ఉన్నా... ఎదగవేమోననే చాలా మందికి ఓ సందేహం. అది నిజమే కానీ... దీపాల వెలుగులోనూ, పరోక్షంగా వచ్చే వెలుతురులోనూ పెంచుకోగల మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటిపై ఎలా శ్రద్ధ చూపాలో తెలుసుకుంటే సరి. మీరు కోరుకున్నది సాధ్యమవుతుంది.

జెడ్‌జెడ్‌ప్లాంట్‌: ఎండపొడ తగలని ఇంటి మూలలు కాంతివిహీనంగా ఉన్నప్పుడు చక్కని ఎంపిక జెడ్‌జెడ్‌ ప్లాంట్‌. ఆఫ్రికన్‌ దేశంలో పుట్టిన ఈ మొక్క ఫ్లోరెసెంట్‌ దీపాల కాంతిని గ్రహిస్తుంది. అలానే పొడి వాతావరణాన్ని తగ్గిస్తుంది. నీటి అవసరం తక్కువ. చూడ్డానికీ మెరుపుతో, ముదురు ఆకుపచ్చ ఆకులతో బాగుంటుంది.

ఫిలడెండ్రాన్‌: సులువుగా పెరిగే ఇంటి మొక్క. కాంతి తక్కువగా ఉండే మూలల్లో పెంచుకుంటే అందంగా కనిపిస్తుంది. వేగంగా పెరిగే దీన్ని వేలాడే తొట్లలోనూ నాటుకోవచ్చు. గోడకూ, గ్రిల్స్‌కూ పాకించవచ్చు. మట్టి మరీ పొడిబారిందనుకున్నప్పుడు కాస్త తడిపితే సరిపోతుంది.

పీస్‌ లిల్లీ: సులభంగా ఎదుగుతుంది. చూడచక్కగా ఉంటుంది. తక్కువ కాంతిని గ్రహించే ఈ మొక్క ఆకులే కాదు దానికి పూసే తెల్లటి పూలు అదనపు ఆకర్షణ తెచ్చిపెడతాయి. దీన్నే స్పాతిఫైలమ్‌ అని కూడా అంటారు. ఇది పద్దెనిమిది నుంచి ముప్ఫైఆరు అంగుళాల వరకూ పెరుగుతుంది. అయితే కాంతి అవసరం తక్కువే అయినా... నీళ్లు మాత్రం క్రమం తప్పక పోయాలి. మట్టి మరీ పొడిబారుతుంటే కొన్ని నీళ్లను దాని చుట్టూ గాల్లో చిలకరించండి. ఈ మొక్కకు గాలిని శుభ్రపరిచే లక్షణముందని నాసా చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్