మనోహరంగా... మెట్లబాట

గదులను అలంకరించుకుంటాం కానీ మెట్ల దారిని పెద్దగా పట్టించుకోం. దాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇలా చేసి చూడండి.. ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో...

Published : 17 Jun 2021 01:08 IST

గదులను అలంకరించుకుంటాం కానీ మెట్ల దారిని పెద్దగా పట్టించుకోం. దాన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇలా చేసి చూడండి.. ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో...
మెట్ల పొడవునా గోడకు చక్కని హ్యాంగింగ్స్‌ తగిలిస్తే ముచ్చటగా ఉంటుంది. నచ్చిన రంగులు, డిజైన్లలో మ్యూరల్‌ పెయింట్‌ వేస్తే అందానికి అందం.. బోల్డంత తృప్తి.
* రెయిలింగుకు హ్యాంగ్‌ చేసే టంబ్లర్‌ లాంటి చిన్ని చిన్ని పూలకుండీలొస్తున్నాయి. వాటిని తగిలిస్తే మొక్కలు పెంచినట్లూ అవుతుంది. మెట్లకు శోభా వస్తుంది. మనీ ప్లాంట్‌ లాంటి క్రీపర్లు లేదా ఇండోర్‌ ప్లాంట్స్‌ అమర్చినా మనోహరంగా ఉంటుంది.
* మెట్ల కింద ఖాళీ స్థలంలో టీపాయ్‌ వేసి చిన్న చిన్న విగ్రహాలు లేదా బొమ్మలతో అలంకరిస్తే స్థలాన్ని చక్కగా వినియోగించినట్లవుతుంది. స్థలం ఎక్కువగా ఉంటే కుర్చీలు వేసి సిటవుట్‌లా చేసుకోవచ్చు. లేదా చెక్కతో కప్‌బోర్డ్స్‌ చేయిస్తే చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు.
* మీరు బుక్‌ లవర్స్‌ అయితే పుస్తకాలతో చిన్నపాటి లైబ్రరీ ఏర్పాటు చేస్తే చూడముచ్చటగా ఉంటుంది.
* స్టెయిర్‌కేస్‌ మూలల్లో పూల కుండీలు పెట్టినా కనువిందు చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్