పాతవి... పారేయకండి!

ఇంట్లో పాత దుస్తులు పేరుకుపోతూ ఉంటాయి. అలాంటి వాటిని అవసరమైన వారికి ఇవ్వొచ్చు. అందుకు వీలుకాకపోతే వాటిని మళ్లీ పనికొచ్చేలా మార్చుకోవచ్చు. ఎలా అంటారా?

Published : 20 Jun 2021 01:40 IST

ఇంట్లో పాత దుస్తులు పేరుకుపోతూ ఉంటాయి. అలాంటి వాటిని అవసరమైన వారికి ఇవ్వొచ్చు. అందుకు వీలుకాకపోతే వాటిని మళ్లీ పనికొచ్చేలా మార్చుకోవచ్చు. ఎలా అంటారా?
* డోర్‌ మ్యాట్‌... పాత తువ్వాళ్లు, బెడ్‌షీట్స్‌ను డోర్‌ మ్యాట్‌లుగా మార్చుకోవచ్చు. వాటిని నచ్చిన ఆకారంలో కత్తిరించి రెండు మూడు పొరలుగా వేసి చివర్లన్నింటినీ కుడితే సరి. అలాగే మధ్యలో కూడా కుట్టాలి. వాటిని వాష్‌రూమ్‌లు, బెడ్‌రూమ్‌లో మంచం పక్కన చక్కగా వాడుకోవచ్చు.
* యాప్రాన్‌లా... పాత కాటన్‌ చున్నీలు, చీరలను చక్కగా యాప్రాన్‌లా కుట్టేసి వాడేసుకోవచ్చు. దీంతో కొత్తది కొనాల్సిన ఖర్చు తప్పుతుంది.
* పరదాల్లా... పాత సిల్కు, సన్నంచు పట్టు చీరలనూ పరదాల్లా వేస్తే గదులకు కొత్త కళ వస్తుంది.
* స్టీలు హ్యాంగర్లు తుప్పు పట్టకుండా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు ఇలా చేసి చూడండి. మీరు వాడని రకరకాల రంగుల వస్త్రాలను సన్నగా కత్తిరించి హ్యాంగర్స్‌కు చుట్టేయండి. ఇవి అల్మారాలో వైవిధ్యంగా కనిపిస్తాయి.

* పాత జీన్స్‌ ప్యాంట్లు, షార్ట్‌లను చేతి సంచులు, వాల్‌ హ్యాంగింగ్‌, పరదాలు, దిండు గలేబులుగా మార్చి వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్