కుండల్లో  వండేద్దామా...

అమ్మమ్మలు, నాన్నమ్మలు అన్నీ మట్టిపాత్రల్లోనే వండేవాళ్లు. స్టీలు సామాన్లొచ్చి వంటింటిని ఆక్రమించేశాయి. చరిత్ర పునరావృతమవుతుంది అన్నట్టు ఇప్పుడు మళ్లీ వీటిల్లో వండేందుకు సిద్ధపడుతున్నారు కొందరు. ఆ లాభాలేంటో మనమూ చూద్దామా!...

Updated : 22 Jun 2021 04:55 IST

అమ్మమ్మలు, నాన్నమ్మలు అన్నీ మట్టిపాత్రల్లోనే వండేవాళ్లు. స్టీలు సామాన్లొచ్చి వంటింటిని ఆక్రమించేశాయి. చరిత్ర పునరావృతమవుతుంది అన్నట్టు ఇప్పుడు మళ్లీ వీటిల్లో వండేందుకు సిద్ధపడుతున్నారు కొందరు. ఆ లాభాలేంటో మనమూ చూద్దామా!

ప్రకృతిలోంచి వచ్చిన మట్టిలో బి12తో సహా అనేక విటమిన్లు ఉంటాయి. కాయగూరల్లోని పోషకాలేవీ వృథా పోవు. పాత్ర నిండా ఆవిరి పరచుకుని, దానితోనే మగ్గుతుంది కనుక ఆరోగ్యానికి మంచిది. పైగా రుచి కూడా అధికం.

మట్టిపాత్ర త్వరగా వేడెక్కుతుంది.. పదార్థాలూ త్వరగా ఉడుకుతాయి. వీటిల్లో ఎక్కువ సమయం తీసుకునే కందిపప్పు, దొండ కాయ లాంటివే కాదు మాంసాహారాలు సైతం వేగంగా, రుచిగా వండుకోవచ్చు. సమయం, ఇంధనం కలిసొస్తాయి. ఆహారమూ చాలా సేపు వేడిగా ఉంటుంది కాబట్టి మళ్లీ మళ్లీ వేడి చేయనవసరం లేదు. అందువల్ల పోషకాలు ఆవిరైపోవు.

ఈ పాత్రల్లో వంటకు నూనె పెద్దగా అవసరం ఉండదు. దీనివల్ల ఒంట్లో కొవ్వు చేరదు. మట్టి పాత్రలు త్వరగా పగిలిపోతాయనే భయం అవసరం లేదు. వీటిని అమర్చే విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలాకాలం మన్నుతాయి.

జాగ్రత్తలు ఇలా...

ఒకేసారి ఎక్కువ మంటపెడితే పగిలే అవకాశం వుంది. కనుక సెగ నెమ్మది నెమ్మదిగా పెంచాలి.

వీటిని సబ్బుతో శుభ్రపరిస్తే దాన్ని పీల్చుకుంటాయి. కనుక సున్నిపిండి, వేడినీళ్లతో కడగటం ఉత్తమం.

అతి శీతలం నుంచి అతి ఉష్ణానికి మారిస్తే వీటికి పగుళ్లు రావచ్చు. కనుక అంత తేడా లేకుండా చూడాలి.

మట్టి పాత్రలు అనగానే కట్టెల పొయ్యి మీదే వాడాలి కాబోలు అనిపిస్తుంది. కానీ గ్యాస్‌ పొయ్యి మీద కూడా ఈ పాత్రలతో నిరభ్యంతరంగా వండుకోవచ్చు. అందుకు అనువుగా పట్టుకోవడానికి హ్యాండిల్‌తో సహా వాటిని రూపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్