పాన్‌ల శుభ్రతకూ ఓ పద్ధతి!

చిన్న కడాయిలో పోపు పెడతాం. పెద్ద ఇనుప మూకుడులో మురుకులు, అప్పాలు.. లాంటి పిండివంటలు చేస్తాం. నేటి కాలంలో తరచూ వాడేది నాన్‌స్టిక్‌ పాన్‌లే.

Updated : 13 Sep 2022 14:24 IST

చిన్న కడాయిలో పోపు పెడతాం. పెద్ద ఇనుప మూకుడులో మురుకులు, అప్పాలు.. లాంటి పిండివంటలు చేస్తాం. నేటి కాలంలో తరచూ వాడేది నాన్‌స్టిక్‌ పాన్‌లే. ఇలా వివిధ సందర్భాల్లో వివిధ రకాలు  వాడటం మనకలవాటే... మరి వీటన్నింటినీ ఒకేలా శుభ్రం చేస్తే ఎలా? ఒక్కోదాన్ని ఒక్కోలా శుభ్రం చేయాలి. అదెలానో చూద్దాం...

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాన్‌... వేడినీళ్లు/హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, వంటసోడా కలిపిన మిశ్రమంతో వీటిని తోమితే జిడ్డుపోయి మిలమిలా మెరుస్తాయి.

అల్యూమినియం... టార్టర్‌ అనే రసాయనం ఉపయోగించి వీటిని శుభ్రం చేస్తే కొత్తవాటిలా మారతాయి. ఆ పొడి లేకపోతే వైట్‌ వెనిగర్‌నూ వాడొచ్చు.

రాగి... వెనిగర్‌లో కాస్తంత ఉప్పు కలిపి మృదువైన స్క్రబర్‌తో తోమితే కొత్తదానిలా మెరిసిపోతుంది.

ఇనుము... గోరువెచ్చటి నీళ్లు, డిష్‌వాషర్‌తో శుభ్రం చేయాలి. ఆ తర్వాత తడిపోయేలా ఆరబెట్టి వంటనూనె వేసి కాస్త వేడి చేసి పెట్టేయాలి.

ఎనామిల్‌.. వంటసోడా, గోరువెచ్చని నీళ్లతోపాటు మృదువైన బ్రెజిల్స్‌ ఉన్న బ్రష్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

నాన్‌స్టిక్‌... డిష్‌వాషింగ్‌ డిటర్జెంట్‌, వేడినీళ్లు, మెత్తని స్పాంజ్‌తో దీన్ని చక్కగా తోమి పక్కన పెట్టేయొచ్చు.

గాజు... ఇంట్లో సాధారణంగా వాడే సబ్బు లేదా గోరువెచ్చటి నీటిలో కాస్తంత వంటసోడా కలిపి ఆ నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. అయితే దీన్ని తోమడానికి మృదువైన స్క్రబర్‌ను మాత్రమే వాడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్