చాప్‌బోర్డు నుంచి...టేబుల్‌ వరకు..

టేకును రాజసానికి గుర్తుగా అభివర్ణిస్తుంటారు. ఒకప్పుడు టేకుతో చేసిన సామగ్రి ఇంట్లో ఉండటం గౌరవ సూచకంగానూ భావించేవారు. ఏళ్లపాటు మన్నికతో దీని విశిష్టత. ఇప్పటికీ ఎన్ని రకాల కలపలు ఉన్నా టేకు మాత్రం ప్రత్యేకం

Updated : 23 Nov 2022 11:03 IST

టేకును రాజసానికి గుర్తుగా అభివర్ణిస్తుంటారు. ఒకప్పుడు టేకుతో చేసిన సామగ్రి ఇంట్లో ఉండటం గౌరవ సూచకంగానూ భావించేవారు. ఏళ్లపాటు మన్నికతో దీని విశిష్టత. ఇప్పటికీ ఎన్ని రకాల కలపలు ఉన్నా టేకు మాత్రం ప్రత్యేకం. అందుకే దీన్నే ఎంచుకున్నా నంటోంది సెరినా ఎల్జా జాన్‌. టి.ఇ.ఎ.కె. పేరుతో గృహాలంకరణ, ఇతర వస్తువులను రూపొందిస్తోంది. చాప్‌బోర్డు నుంచి డైనింగ్‌ టేబుల్‌ వరకు అన్ని రకాలనూ తయారు చేసి ఇన్‌స్టా వేదికగా అమ్ముతోంది. పైగా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో వీటిని విక్రయిస్తోంది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో తయారు చేసి అమ్మడం తనకు ఇష్టం లేదంటుంది సెరినా. కొన్న వారికి ప్రత్యేకమనే భావన కలిగించాలన్న ఉద్దేశమే ఇందుకు కారణమట. అన్నట్టూ.. ఈమె లాయర్‌. అభిరుచి కొద్దీ తయారు చేస్తోంది. వీటిని మీరూ చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్