ఇంట్లో అందరికీ తెలియాల్సిందే..

పావని రెండేళ్ల కూతురు కిందపడిపోయింది. ఆ సమయంలో తల్లి బయటకు వెళ్లడంతో చెల్లి దెబ్బలకు మందు ఎలా రాయాలో తెలియలేదు ఆరేళ్ల రాజాకు. భోజనాలు చేస్తున్నప్పుడు కరెంటు పోయింది. కొవ్వొత్తి ఎక్కడ ఉంటుందో ఎవరికీ కనిపించలేదు. ఇలా అవసరమయ్యే వస్తువులను అందరికీ తెలిసేలా ఉంచడం,

Published : 03 Jul 2021 01:11 IST

పావని రెండేళ్ల కూతురు కిందపడిపోయింది. ఆ సమయంలో తల్లి బయటకు వెళ్లడంతో చెల్లి దెబ్బలకు మందు ఎలా రాయాలో తెలియలేదు ఆరేళ్ల రాజాకు. భోజనాలు చేస్తున్నప్పుడు కరెంటు పోయింది. కొవ్వొత్తి ఎక్కడ ఉంటుందో ఎవరికీ కనిపించలేదు. ఇలా అవసరమయ్యే వస్తువులను అందరికీ తెలిసేలా ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం అవసరం.
మెడికల్‌ కిట్‌... ఇంట్లో మెడికల్‌ కిట్‌ ఉండటం ముఖ్యం. ఇందులో డెటాల్‌, యాంటీ సెప్టిక్‌ పౌడర్‌/ ఆయింట్‌మెంట్‌, గ్లాస్‌క్లాత్‌, చిన్న కత్తెర, థర్మామీటర్‌ ఉండాలి. ఎవరికైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు వాటిని ముందుగా డెటాల్‌లో దూదిని ముంచి క్లీన్‌ చేయాలి. తర్వాత దెబ్బపై యాంటీ బయాటిక్‌ ఆయింట్‌మెంట్‌, లేదా పౌడర్‌ అద్దాలి. రక్తం ఆగకపోతే, తడి వస్త్రాన్ని రెండు నిమిషాలు ఆ ప్రాంతంలో ఉంచితే తగ్గుతుంది. ఆ తర్వాత శుభ్రం చేయాలి. చివర్లో గ్లాస్‌క్లాత్‌తో కట్టుకడితే చాలు. ఈ అత్యవసర చికిత్సను పిల్లలకూ నేర్పించాలి.

అత్యవసరమైన సందర్భాల్లో.... కరెంట్‌ పోతే పనికొచ్చే కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలను ఓ పెట్టెలో ఉంచి అందరికీ తెలిసే చోట పెట్టాలి. దారాల పెట్టెనూ అందుబాటులో ఉంచుకోవాలి. బొత్తాలు ఊడినా, ఏదైనా చిరిగినా వెంటనే వాటిని కుట్టుకోవచ్చు. ఈ బాక్సులు ఎక్కడ ఉంటాయో ఇంటిల్లపాదికీ తెలిసి ఉండాలి.
పిల్లలకు... చిన్నారులు పెన్సిళ్లు, పెన్నులు, ఎరేజర్‌, షార్ప్‌నర్‌ వంటివి తరచూ వినియోగిస్తారు. వాడాక యథాస్థానంలో ఉంచేలా అలవాటు చేయాలి.
మీ కోసం... ఆఫీసుకు వెళ్లేప్పుడు దువ్వెన కనిపించదు. బండి తాళాలు ఎక్కడో ఉంటాయి. వెదుక్కోడానికే సమయం చాలదు. అలాకాకుండా దువ్వెన, అద్దం వంటి వస్తువులను ఓ అలమర లేదా బాక్సులో ఉంచాలి. వినియోగించిన వాళ్లు తీసిన చోటే తిరిగి భద్రపరచాలనే నియమాన్ని పాటించాలి. అన్ని తాళాలనూ ఓ హ్యాంగర్‌కు వేలాడదీయాలి. బయట నుంచి వచ్చినప్పుడు వాటిని అక్కడే తగిలిస్తే చాలు. ఇలా క్రమశిక్షణను అలవరుచుకుంటే వెతుక్కోవాల్సిన కష్టం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్