మీ కోసం.. కొంత సమయం

గృహిణులైనా, ఉద్యోగినులైనా.. కరోనా తర్వాత బాధ్యతలు పెరిగాయన్నది వాస్తవం. దీంతో కొంత కోపం, చిరాకు తెలియకుండానే బయటికొచ్చేస్తున్నాయి. తీరిక లేకపోవడమూ దీనికి కారణం. ఇలాగే

Published : 08 Jul 2021 00:36 IST

గృహిణులైనా, ఉద్యోగినులైనా.. కరోనా తర్వాత బాధ్యతలు పెరిగాయన్నది వాస్తవం. దీంతో కొంత కోపం, చిరాకు తెలియకుండానే బయటికొచ్చేస్తున్నాయి. తీరిక లేకపోవడమూ దీనికి కారణం. ఇలాగే కొనసాగితే ఎలా? మీకంటూ కాస్త తీరిక చేసుకోండి.

నడక: ‘అసలే సమయం లేదంటుంటే..’ అనకండి. దీన్నో పనిలా పెట్టుకుని చేస్తే అలాగే అనిపిస్తుంది. కాస్త విరామంగా తీసుకుని ప్రయత్నించండి. దీర్ఘకాల పని చేసేముందో, తర్వాతో ఆరు బయటో, డాబా మీదో అలా నాలుగు అడుగులేయండి. చల్లగాలి శరీరాన్ని తేలిక పరుస్తుంది. కొంత మ్యూజిక్‌ జత అయితే వ్యాయామంతోపాటు మనసూ కుదుటపడుతుంది.

వంట: ‘రోజూ ఉండేదేగా!’ అని తీసిపారేయొద్దు. కొత్తవి ప్రయత్నించండి. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడంలో వంట పాత్రను తక్కువ చేయలేం. తక్కువ సమయంలో రుచిగా చేసే వాటిపై దృష్టిపెడితే భవిష్యత్తులోనూ ఉపయోగపడతాయి.

సృజన: కొత్తగా నేర్చుకునేదేదైనా భావోద్వేగాలపై అదుపును తెస్తుందట. పెయింటింగ్‌, అల్లికలు, సంగీతం.. గతంలో ప్రయత్నించాలనుకుని చేయలేని వాటిని మొదలు పెట్టండి. పూర్తిగా ఒకేసారి కూర్చుని చేయాలన్న నియమం ఏమీలేదు. కొద్దికొద్దిగా ప్రయత్నించొచ్చు. ఇప్పుడు ఎన్నో మార్గాలు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అందుకుని చూడండి.

మార్చండి: ఏమీ తోచలేదూ.. అల్మరాలు, వర్కింగ్‌ టేబుల్‌ను భిన్నంగా మార్చడానికి ప్రయత్నించండి. కొత్తదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. పనిలో పనిగా అక్కర్లేని వాటినీ తీసేయొచ్చు.

చదవండి: ముందు ఏం చదవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. పనిలో కాస్త బద్ధకంగానో, చిరాకుగానో ఉన్నప్పుడు చదవండి. ఎంత చదవాలన్నదీ చూసుకోండి. లేదంటే.. సమయం తేలియకుండానే అయిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్