మురికిని వదిలిద్దాం!

మనం అశ్రద్ధ వహించే వాటిలో డోర్‌మ్యాట్స్‌ ఒకటి. వీటిని తరచూ శుభ్రం చేయకపోతే అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

Published : 09 Jul 2021 00:35 IST

మనం అశ్రద్ధ వహించే వాటిలో డోర్‌మ్యాట్స్‌ ఒకటి. వీటిని తరచూ శుభ్రం చేయకపోతే అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

బకెట్‌లో మగ్గు వేడి నీళ్లు పోయాలి. దీంట్లో చెంచా వంటసోడా, మూడు చెంచాల డిటర్జెంట్‌ వేసి బాగా కలపాలి. తర్వాత అర బకెట్‌ వేడి నీళ్లు పోసి అందులో డోర్‌మ్యాట్స్‌ని నానబెట్టాలి. 

* నీళ్లు చల్లారే వరకు నానాక వాషింగ్‌ మెషిన్‌లో కానీ, చేత్తో కానీ పిండెయ్యచ్చు. మెషిన్‌లో వేసినప్పుడు మ్యాట్స్‌తోపాటు కొన్ని చల్లనీళ్లు, మరో చెంచా డిటర్జెంట్‌ వేసి పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకూ సెట్‌ చేయాలి.

ఇలా కూడా ఉతకొచ్చు....
మ్యాట్‌లను బకెట్‌లో డిటర్జెంట్‌, వంటసోడా, నీళ్లు పోసి ఓ గంట నానబెట్టాలి. తర్వాత రెండు సార్లు మంచినీటిలో జాడించాలి. ఇప్పుడు మెషిన్‌లో డిటర్జెంట్‌, బట్టల సోడా, డెట్టాల్‌ వేసి పిండితే సరి. వంట సోడా, డెట్టాల్‌ మ్యాట్‌లలోని సూక్ష్మజీవులను చంపేస్తే, డిటర్జెంట్‌ మురికిని వదల గొడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్