వంటిల్లు ఓ వైద్యాలయం...

ఆరోగ్యం... మనం తీసుకునే ఆహారం, పాటించే నియమాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వంటగదిని వైద్యాలయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Published : 12 Jul 2021 01:45 IST

ఆరోగ్యం... మనం తీసుకునే ఆహారం, పాటించే నియమాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వంటగదిని వైద్యాలయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

ప్పు ధాన్యాలు... వంటింట్లో ఉండాల్సిన అత్యంత ముఖ్యమైనవి పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు. రాజ్మా, సెనగలు, సోయాబీన్స్‌, పెసలు వంటి పప్పుల్లో ఉండే అమినోయాసిడ్స్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ వీటిని ఆహారంలో వినియోగిస్తే, బ్యాక్టీరియాలను నాశనం చేసి, వ్యాధులను దరిచేరకుండా కాపాడతాయి. అలాగే బార్లీ, జొన్నలు, ఓట్స్‌, క్వినోవా వంటి చిరుధాన్యాలు జీర్ణాశయ పనితీరును మెరుగుపరచడమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

వంటనూనెలు ... ఆహారంలో వినియోగించే వంటనూనెలు తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతాయనేది చాలామంది అపోహ. కానీ ఆవనూనె, తాజా నెయ్యి, కొబ్బరి నూనె, అన్‌రిఫైన్డ్‌  విత్తనాల నూనెను వంటల్లో వాడటం అలవరుచుకుంటే శరీరంలోని కొవ్వు స్థాయులను సమన్వయం చేస్తాయి.

మసాలా దినుసులు... ఔషధగుణాలున్న మసాలాలకు వంటింట్లో ప్రత్యేక స్థానాన్నివ్వాలి. బిరియానీ ఆకు, లవంగం, దాల్చినచెక్క, జీలకర్ర వంటి వాటిని ఆహరంలో వాడాల్సిందే. అలానే తులసి, పుదీనా, పసుపు వంటివన్నీ సీజనల్‌ వ్యాధులను దగ్గరకు రానీయవు.

వంటపాత్రలు... వంటలో వేసే పదార్థాలు, కూరగాయలను ఎలా ఎంచుకుంటామో, అలాగే  వాటిని వండే పాత్రల ఎంపికలోనూ శ్రద్ధవహించాలి. ఇనుము, స్టీలు, మట్టి, సెరామిక్‌ లేదా గాజు పాత్రలను ఉపయోగించాలి. వీటిలో పోషకాలు వృథాకాకుండా ఉంటాయి. అలాకాకుండా అల్యూమినియం, నాన్‌స్టిక్‌ కుక్‌వేర్స్‌ను వాడితే మాత్రం వాటిలోని రసాయనాలను వంటకాలు పీల్చుకుంటాయి. వీటిని తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్